Movie News

ప్రెస్ మీట్లో త‌రుణ్ భాస్క‌ర్ ర‌చ్చ ర‌చ్చ‌

పెళ్లిచూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాల్లో త‌రుణ్ భాస్క‌ర్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎలాంటిందో అంద‌రూ చూశారు. ఈ రోజే రిలీజైన త‌రుణ్ కొత్త చిత్రం కీడా కోలాలోనూ కావాల్సినంత ఫ‌న్ ఉంటుంద‌ని అర్థ‌మైంది. సినిమాల్లోనే కాదు.. బ‌య‌ట కూడా త‌రుణ్ చాలా ఫ‌న్నీగా మాట్లాడ‌తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. కీడా కోలా ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో అత‌ను చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

ఈ ప్రెస్ మీట్‌కు హాజ‌రైన టీం స‌భ్యులు, అలాగే జ‌ర్న‌లిస్టులు క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వుకుని ఆడిటోరియం నుంచి బ‌య‌టికి వెళ్లారు. ఆ స్థాయిలో త‌న పంచులతో అంద‌రినీ న‌వ్వించాడు త‌రుణ్‌. అలా అని అదేదో ప్లాన్ చేసుకుని వ‌చ్చిన‌ట్లు, ప‌బ్లిసిటీ కోసం చేసిన‌ట్లు కాకుండా.. స్పాంటేనియ‌స్‌గా త‌రుణ్ కామెడీ పండించ‌డం హైలైట్.

వ‌రుస‌గా సురేష్ బాబుతోనే సినిమాలు చేస్తున్నారేంటి.. ఆ కాంపౌండ్లో మిమ్మ‌ల్ని క‌ట్టేశారా అని అడిగితే.. తానే సురేష్ బాబును క‌ట్టేశాన‌ని.. ఆయ‌నే వ‌చ్చి ఇంకెప్పుడు సినిమా పూర్తి చేస్తావ్ అని ఫ్ర‌స్టేట్ అవుతుంటాన‌ని అన్నాడు త‌రుణ్‌. ఇక సురేష్ బాబుతోనే సినిమాలు చేయ‌డం గురించి స్పందిస్తూ.. త‌న‌కు న్యూమ‌రాల‌జీ మీద న‌మ్మ‌కాలెక్కువ అని.. సురేష్ పేరు ఉంటే చాలు ఎవ‌రితో అయినా సినిమాలు చేస్తాన‌ని.. సురేష్ కొండేటితో అయినా సినిమాకు రెడీ అంటూ పంచ్ వేశాడు త‌రుణ్‌.

ఇక తాను న‌ట‌న‌లోకి రావ‌డం గురించి స్పందిస్తూ.. కొన్నేళ్ల ముందు తాను జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంకు వెళ్లాన‌ని.. ఆ త‌ర్వాతి రోజు ఇస్త్రీ చేసే ఒక‌త‌ను మీరు జ‌బ‌ర్ద‌స్త్ క‌దా అని గుర్తుప‌ట్టాడ‌ని.. రెండు జాతీయ అవార్డులు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడిగా మాత్రం త‌న‌ను ఎవ‌రూ గుర్తించ‌లేద‌ని.. అందుకే త‌న ఫేస్ అంద‌రికీ తెలియాల‌ని న‌టిస్తున్న‌ట్లు త‌రుణ్ చెప్ప‌డం విశేషం. ఇలా ఆద్యంతం పంచుల‌తో, న‌వ్వుల‌తో సాగిపోయిన ఈ ప్రెస్ మీట్ తాలూకు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

This post was last modified on October 18, 2023 10:33 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago