పెళ్లి చూపులుతో పరిచయమై ఈ నగరానికి ఏమైంది రూపంలో యూత్ కో కల్ట్ క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇంత సుదీర్ఘమైన కెరీర్ లో చేసింది రెండే సినిమాలు కావడం ఒక మంచి ఫిలిం మేకర్ కి గ్యాప్ వచ్చేలా చేసింది. అందుకే కీడా కోలా మీద చెప్పుకోదగ్గ అంచనాలున్నాయి. ట్రైలర్ చూశాక యూత్ లో క్రేజ్ వచ్చేలా ఉంది. ఇవాళ దీని లాంచ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తరుణ్ భాస్కర్ స్టేజి మీద పంచులు, సెటైర్లతో హోరెత్తించాడు. వెరైటీ ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇస్తూ తన రియల్ కామెడీ టైమింగ్ ని మరోసారి బయట పెట్టుకున్నాడు.
గతంలో తరుణ్ భాస్కర్ వెంకటేష్ కో కథ చెప్పి దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పించుకున్నాడు. గుర్రపు పందేల నేపథ్యంలో ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఇది ఉంటుందని సురేష్ సంస్థ వర్గాల నుంచి లీకులు కూడా వచ్చాయి. కట్ చేస్తే అది ఎంతకీ ముందుకు కదల్లేదు. నారప్ప, ఎఫ్ 3 కన్నా ముందు ఇదంతా జరిగింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ స్క్రిప్ట్ మీదే తరుణ్ చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. అయితే సెకండ్ హాఫ్ సంతృప్తికరంగా రాకపోవడం వల్లే బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది తప్ప వెంకీ కాంబో భవిష్యత్తులో ఉంటుందనే సంకేతమైతే ఇచ్చాడు.
మొదలయ్యే దాకా దీన్ని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. పెద్ద హీరోను సరిగా హ్యాండిల్ చేయకపోతే వచ్చే విమర్శలు తెలుసు కనకే జాగ్రత్తగా ఉన్నానని తరుణ్ చెబుతున్న వర్షన్. ఇక్కడ కీడా కోలా సక్సెస్ కావడం చాలా కీలకం ఇది బ్లాక్ బస్టర్ అయితే వెంకీకి మరింత నమ్మకం కుదురుతుంది. సురేష్ సంస్థనే అంటిపెట్టుకుని ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ బయటి బ్యానర్లకు ఇప్పట్లో చేసే సూచనలు కనిపించడం లేదు. కీడా కోలాలో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఒక వెరైటీ పాత్ర పోషిస్తున్న తరుణ్ భాస్కర్ ముచ్చటగా మూడో హిట్టు కొడతాడో లేదో నవంబర్ మూడున తేలిపోనుంది. చూద్దాం.
This post was last modified on October 18, 2023 7:04 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…