Movie News

ఆ స్టాలిన్ గిల్లుతుంటే.. ఈ స్టాలిన్ దువ్వుతున్నాడు

ఇంకొన్ని గంటల్లో ‘లియో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజవుతోంది. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకునే సినిమాగా ‘లియో’ నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. యుఎస్‌లో ఈ రోజు అర్ధరాత్రి సమయానికే ‘లియో’ షోలు మొదలైపోతాయి. తెలుగులో ఉదయం 7 గంటల నుంచే షోలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలో కూడా అర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేశారు.

కానీ ఈ తమిళ సినిమాకు తమిళనాట మాత్రం ఉదయం 9 లోపు సినిమా చూసే అవకాశం లేదు. ఇది విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఒకప్పుడు ప్రతి పెద్ద సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకే షోలు మొదలైపోయేవి. అప్పుడు అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ ఈ మధ్య స్టాలిన్ సర్కారు బెనిఫిట్ షోల విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటోంది. ఆ షోలన్నింటినీ రద్దు చేసింది.

త్వరలో విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తాడని భావిస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా తన సినిమాను టార్గెట్ చేస్తున్నారని అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చి ఉదయం 9కి ముందు ప్రదర్శన మొదలు కాకూడదని అనడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అర్లీ మార్నింగ్ షోల కోసం గవర్నర్‌ను కలిసినా, కోర్టుకు వెళ్లినా కూడా ఫలితం లేకపోయింది. ఉదయం 7 నుంచి షోలు మొదలయ్యేలా చూడాలని కోర్టు ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినా కూడా స్టాలిన్ సర్కారు పట్టించుకోలేదు.

ఉదయం 9కే షోలు మొదలు అని స్పష్టం చేసింది. ఇది విజయ్ అభిమానులకు అస్సలు రుచించట్లేదు. ఈ పరిణామం స్టాలిన్ సర్కారుకు ప్రతికూలం అవుతుందనే చర్చ జరుగుతుండగా.. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ లైన్లోకి వచ్చాడు. విజయ్ అభిమానులను శాంతింపజేయడానికా అన్నట్లు ‘లియో’ షో చూసి ట్వీట్ వేశాడతను. ఈ సినిమా అదిరిందని చెబుతూ, ఇది ‘ఎల్‌సీయూ’లో భాగం అనే హింట్ ఇచ్చేలా ట్వీట్ వేశాడు. దీంతో సీఎం స్టాలిన్ విజయ్ అభిమానులను గిల్లుతుంటే.. ఉదయనిధి స్టాలిన్ వాళ్లను దువ్వే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

This post was last modified on October 18, 2023 5:18 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago