Movie News

ఓవైపు 20 సినిమాలు.. ఇంకోవైపు కొత్త సంస్థ‌

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ.. ప్ర‌స్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేన‌ర్ అంటే ఇది. తెలుగులో ప్ర‌స్తుతం ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య తెలిస్తే షాక‌వ్వాల్సిందే. ఈ మ‌ధ్యే పాతిక సినిమాల మైలురాయిని అందుకున్న పీపుల్స్ మీడియా.. ప్ర‌స్తుతం 20కి పైగా సినిమాల‌ను లైన్లో పెట్ట‌డం విశేషం. ఒక సంస్థ‌లో ఐదారు సినిమాలు తెర‌కెక్కుతుంటేనే.. వామ్మో అనుకుంటాం.

అలాంటిది 20కి పైగా సినిమాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయంటే షాక‌వ్వాల్సిందే. బ‌హుశా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఒక సంస్థ‌లో ఒక టైంలో ఇన్ని సినిమాలు వివిధ ద‌శ‌ల్లో ఉండ‌టం జ‌రిగి ఉండ‌దు. ఒక‌ప్పుడు చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాలే తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ.. ఈ ఏడాది బ్రో లాంటి పెద్ద సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్-మారుతి మూవీ స‌హా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థ‌లో తెర‌కెక్కుతున్నాయి. ఐతే ఇన్ని సినిమాలు లైన్లో ఉండ‌గా.. ఈ కాంపౌండ్ నుంచి మ‌రో బేన‌ర్ రాబోతోంద‌ట‌. గీతా ఆర్ట్స్ వాళ్లు చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల కోసం గీతా ఆర్ట్స్-2 బేన‌ర్ పెట్టిన‌ట్లు పీపుల్స్ మీడియా వాళ్లు కూడా ఇదే ల‌క్ష్యంతో సెకండ్ బేన‌ర్ తీసుకొస్తున్నార‌ట‌. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ త‌న‌యురాలు ఈ బేన‌ర్‌ను హ్యాండిల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

త‌క్కువ‌ బ‌డ్జెట్లో యంగ్ ఫిలిం మేక‌ర్లు.. కొత్త న‌టీన‌టుల‌ను పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాల‌న్న‌ది ఈ సంస్థ ల‌క్ష్యం. ఓటీటీల కోసం కూడా కంటెంట్ చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం క‌థ‌లు వింటున్న టీం.. త్వ‌ర‌లోనే కొన్ని ప్రాజెక్టుల‌ను ఫైన‌లైజ్ చేసి ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ బేన‌ర్ లాంచ్ సినిమాను ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

This post was last modified on October 17, 2023 9:21 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago