ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టబోతున్న భగవంత్ కేసరి మీద అభిమానుల ఎదురు చూపులు ఏ రేంజ్ లో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీమ్ మొత్తం కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రమోషన్లలో బాలయ్య, శ్రీలీల మధ్య బాండింగ్ నే ఎక్కువగా హైలైట్ చేయడం వల్ల మిగిలిన అంశాలు ఎలా ఉంటాయనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. మీకు చెప్పని సర్ప్రైజ్ విషయాలు చాలా దాచామని దర్శకుడు అనిల్ రావిపూడి పదే పదే ఊరించడం అంచనాలను అమాంతం పెంచేస్తోంది. దీని గురించే ఓ లీక్ ముచ్చట చూద్దాం.
కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య అసలు ఎంట్రీ ఉంటుందట. జైల్లో ఎందుకు ఎక్కువ కాలం మగ్గాల్సి వచ్చింది, స్వంత కూతురు కాకపోయినా శ్రీలీలని అంత జాగ్రత్తగా ఎందుకు చూసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరుకుతుందట. శరత్ కుమార్ పాత్ర ఇందులో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు తెలిసింది. అతనికి బాలకృష్ణకు మధ్య ఉన్న బంధమే కథలో సెంట్రల్ పాయింట్ గా మారుతుందని, దానికి శ్రీలీల, అర్జున్ రాంపాల్ క్యారెక్టర్లకు ముడిపెట్టిన తీరు కుటుంబ ప్రేక్షకులను కదిలించడం ఖాయమని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సో ఊహించిన దాని కన్నా ఎక్కువ మ్యాటరే భగవంత్ కేసరిలో ఉండబోతోంది. ట్రైలర్ చివరి షాట్ లో నా ఇష్టం వచ్చినట్టు పాడతా అని బాలయ్య చెప్పేది జైలు శిక్ష అనుభవిస్తున్న సన్నివేశంలోనే. అయితే తన గతాన్ని వివరించే క్రమం హై వోల్టేజ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత ఉండొచ్చని మరో టాక్. వినడానికి పక్కా కమర్షియల్ స్కేల్ లో అనిపిస్తున్న ఎలిమెంట్స్ ని దర్శకుడు అనిల్ రావిపూడి సమర్ధవంతంగా హ్యాండిల్ చేసి ఉంటాడని చెప్పడం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లియో కంటే కొంత లేట్ గా మొదలైనా ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ డే హౌస్ ఫుల్స్ కి ఎక్కువ సమయం పట్టేలా లేదు.
This post was last modified on October 16, 2023 7:30 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…