ఉత్తరాది భామలు చాలామంది తెలుగులో హీరోయిన్లుగా బలమైన ముద్ర వేసిన వాళ్లే. కానీ వాళ్లలో మన సినిమాలను, మన ప్రేక్షకులను బాగా ఓన్ చేసుకుని.. ఇక్కడి అమ్మాయిలా కలిసిపోయిన హీరోయిన్లు తక్కువమంది. ఈ జాబితాలో రాశి ఖన్నా పేరు కచ్చితంగా చెప్పుకోవాలి. చాలా త్వరగా తెలుగు నేర్చుకుని, తెలుగులో పాటలు పాడుతూ, హైదరాబాద్‌లో ఒక ప్రాపర్టీ కూడా కొనుక్కుని ఇక్కడే సెటిలయ్యేలా కనిపించిన అమ్మాయి రాశి ఖన్నా.
తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తోనే బలమైన ముద్ర వేసి ఆమె.. తర్వాత ‘తొలి ప్రేమ’ సహా కొన్ని చిత్రాలతో మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్ సరసన చేసిన ‘జై లవకుశ’తో టాప్ లీగ్‌లోకి అడుగు పెట్టేలా కనిపించిన రాశి.. ఆ తర్వాత అనూహ్యంగా డౌన్ అయిపోయింది. వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ను కిందికి లాగేశాయి. అందం, అభినయం, చలాకీతనం అన్నీ ఉన్నా.. ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పక్కా కమర్షియల్, థ్యాంక్‌యు.. ఇలా ఆమె చివరి మూడు తెలుగు చిత్రాలు ఒకదాన్ని మించి డిజాస్టర్లు కావడంతో టాలీవుడ్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లే కనిపించింది. ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక ఏడాది పాటు ఛాన్సులు ఆగిపోయాయంటే ఆటోమేటిగ్గా కెరీర్‌కు తెరపడిపోతుంది. రకుల్ ప్రీత్ ఇలాగే కనుమరుగైపోయింది. రాశికి అదే పరిస్థితి తలెత్తుతుందని అనుకుంటుండగా.. ఇప్పుడో మంచి ఛాన్స్ ఆమె తలుపు తట్టింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డతో ఆమె ‘తెలుసు కదా’ సినిమా చేయబోతోంది.
స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఈ రోజే అనౌన్స్ చేశారు. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరో కథానాయికగా నటిస్తోంది. టైటిల్ టీజర్ చూస్తే మంచి బడ్జెట్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాశి ఒకప్పుడు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే కానీ.. ఇప్పుడు ఆమె ఉన్న స్థితిలో ఇది కూడా పెద్ద ఛాన్సే. మరి దీన్ని ఉపయోగించుకుని టాలీవుడ్‌లో కెరీర్‌ను పొడిగించుకుంటుందేమో చూడాలి.
This post was last modified on October 16, 2023 4:15 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…