విక్టరీ వెంకటేష్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్న సినిమా సైంధవ్. తమ హీరో కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో పాటు మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో హైప్ అంతకంతా పెరుగుతోంది. హిట్ రెండు సిరీస్ లతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను మూడో చిత్రానికే ఇంత పెద్ద ఆఫర్ దక్కడంతో క్రేజీ యాక్షన్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల కాబోతున్న సైంధవ్ ప్రమోషన్లకు ఇవాళ టీజర్ లంచ్ తో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ ఏఎంబి మాల్ లో జరిగిన ఈవెంట్లో దీని ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
దక్షిణాది రాష్ట్రంలో ఇంద్రప్రస్థ అనే ఊరిలో భార్య పాపతో సంతోషంగా ఉంటాడు సైంధవ్ అలియాస్ సైకో(వెంకటేష్). చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చి వాళ్ళను టెర్రరిస్టులుగా మార్చే ప్రమాదకరమైన మిషన్ కోసం అక్కడికి వస్తాడు వికాస్(నవాజుద్దీన్ సిద్ధిక్). దీన్ని ప్రభుత్వం పసిగట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోయి నరమేధం మొదలవుతుంది. ఇదంతా ఒకప్పుడు చూసి దూరంగా ఉన్న సైంధవ్ వెనక్కు తిరిగి వచ్చి దీనికి కారణమైన వాళ్ళ ఊచకోతను మొదలుపెడతారు. తర్వాత జరిగేది ఏంటో ఇంకో మూడు నెలలు ఆగితే చూడొచ్చు.
దర్శకుడు శైలేష్ కొలను చాలా ఇంటెన్స్ అండ్ వయొలెంట్ గా సైంధవ్ ని రూపొందించినట్టు విజువల్స్ లో స్పష్టం చేశారు. ప్రమాదకరమైన మాఫియాను ఎదురుకోవడానికి వెంకటేష్ కత్తి గన్ను పట్టుకుని శత్రు సంహారం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా గ్యాప్ తర్వాత విక్టరీ రియల్ మాస్ బయటికి వచ్చినట్టు అనిపించింది. సంతోష్ నారాయన్ నేపధ్య సంగీతం, మణికందన్ ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో ఉన్నాయి. అంచనాలు పెంచడంలో, సంక్రాంతి పండగ బరిలో వెంకీ ఏ రేంజ్ లో విశ్వరూపం చూపబోతున్నాడో ఒక ఐడియా ఇవ్వడంలో సైంధవ్ టీమ్ సక్సెస్ అయ్యింది.
This post was last modified on October 16, 2023 12:37 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…