పరిశ్రమకు వచ్చి ఏళ్ళ తరబడి కష్టపడి ఎదురు చూసి డిజె టిల్లు రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ దాని సీక్వెల్ కోసమే చాలా టైం తీసుకున్నాడు. తొందరపడి సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ కొంత ఆలస్యమవుతున్నా సరే క్వాలిటీ కోసం రాజీ పడకుండా ఇంకా తీయిస్తూనే ఉన్నాడు. తాజాగా ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ మరింత ఆసక్తి రేపేలా ఉంది. సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నచిత్రానికి తెలుసు కదా అనే కవితాత్మకత టైటిల్ ని ఫిక్స్ చేసి వెరైటీ టీజర్ తో ప్రకటించారు.
తెలుసు కదాలో సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లు నటిస్తున్నారు. సంగీతం తమన్ సమకూరుస్తుండగా, యువరాజ్ ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నాడు. క్యాస్టింగ్ తో పాటు టెక్నికల్ టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో బడ్జెట్ పరంగా రాజీలు ఉండవు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పారు. ఖరీదయిన డైనింగ్ టేబుల్, సూటు బూటు వేసుకుని సిద్ధూ అక్కడికి వచ్చా దర్జాగా కూర్చుని మెనూ తీసుకుని కెమెరా వైపు చూస్తూ తెలుసు కదా అని చెప్పడం భావుకతతో నిండిపోయింది.
తెలుగులో పేరు పెట్టడమే పెద్ద సవాల్ గా మారిపోతున్న ట్రెండ్ లో ఇలా తెలుసు కదా అనే సింపుల్ పదాలతో నీరజ కోన టైటిల్ నిర్ణయించడం బాగుంది. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తోంది కాబట్టి విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రేమించడం, ప్రేమించబడటం ఒకటే నిజమైన జీవన సూత్రమంటూ పెట్టిన ట్యాగ్ లైన్ ఇది లవ్ స్టోరీ అని టీజర్ చెప్పకనే చెబుతోంది. కాకపోతే సిద్దు మార్కు అల్లరి, సందడి, వెరైటీ బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండకపోవచ్చు. నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు, జానర్లు టచ్ చేయాలి. అప్పుడే అసలైన టాలెంట్ రాటు దేలుతుంది. సిద్దు చేస్తోంది అదే
This post was last modified on October 16, 2023 11:27 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…