జనవరి సంక్రాంతి రేసులో పెద్ద పోటీకి సిద్ధమవుతున్న వెంకటేష్ సైంధవ్ మీద దగ్గుబాటి అభిమానుల అంచనాలు మాములుగా లేవు. తమ హీరో ఊర మాస్ ని వాళ్ళు చాలా కాలంగా మిస్సవుతున్నారు. ఎఫ్2, ఎఫ్3 ఎంత హిట్ అయినా అవి పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్లు. గురు సీరియస్ ఎమోషనల్ డ్రామా. అంతకు ముందు గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటివి మరీ సాఫ్ట్ జానర్ అయిపోయాయి. నారప్ప, వెంకీ మామ సంతృప్తినివ్వలేదు. ఒకప్పటి జయం మనదేరా, బొబ్బిలిరాజా, లక్ష్మి, తులసి రేంజ్ మాస్ ని మళ్ళీ సైంధవ్ లో చూడొచ్చని కొండంత ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటుంది. సైంధవ్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. అయినా ఫ్యాక్షన్ తరహా నరుకుళ్లు, రక్తపాతాలు, అరుచుకోవడాలు ఉండవు. చాలా సెటిల్డ్ గా హీరో చేసే విధ్వంసం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ విపరీతంగా కనెక్ట్ అవుతున్న లోకేష్ కనగరాజ్ తరహా ట్రీట్ మెంట్ ని ఇందులో చూడొచ్చు. మెడికల్ మాఫియా అరచకాలకు పాప సెంటిమెంట్ ని ముడిపెట్టి దర్శకుడు శైలేష్ కొలను చాలా డిఫరెంట్ గా సైంధవ్ ని తీర్చిదిద్దుతున్నాడు. పోస్టర్లలో వెంకీని ఒకే గెటప్ లో చూపించి దాన్నే స్పష్టం చేస్తున్నారు.
రేపు వచ్చే టీజర్ దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తుంది. వయొలెంట్ యాక్షన్ పుష్కలంగా ఉంటుంది కానీ మరీ ఫిజిక్స్ ని సవాల్ చేసే రేంజ్ లో ఫైట్లు గట్రా ఉండకపోవచ్చు. నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా జెరెమియా లాంటి పెద్ద క్యాస్టింగ్ తో శైలేష్ చాలా పెద్ద ప్లానే వేశాడు. హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ ఎంత పేరు తీసుకొచ్చినా వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం శైలేష్ లాంటి కుర్ర దర్శకులకు సవాలే. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, ఈగల్, హనుమాన్ లతో పోటీ పడబోతున్న సైంధవ్ బిజినెస్ పరంగానూ చాలా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
This post was last modified on October 15, 2023 8:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…