ఈ రోజుల్లో సెంటిమెంట్ సినిమాలు ఎవరు చూస్తారు అంటారు కానీ.. పూర్తిగా సెంటిమెంట్‌తో నింపేయకుండా, దాన్ని అండర్ కరెంట్‌గా నడిపిస్తే ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. ‘విక్రమ్’ లాంటి యాక్షన్ మూవీలో కూడా తాత-మనవడు సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ‘సెంటిమెంట్’ టచ్ ఉన్న సినిమాలు మన ప్రేక్షకులను ముంచెత్తబోతున్నాయి. ‘విక్రమ్’ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన ‘లియో’లోనూ తండ్రి-బిడ్డ సెంటిమెంట్ ఉంది.
ఈ సినిమా పోస్టర్లు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ‘విక్రమ్’ను మించి ఇందులో యాక్షన్ ఉంటుందని లోకేష్ చెబుతున్నప్పటికీ.. కథలో తండ్రి-బిడ్డ సెంటిమెంట్ కీలకంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కథ ఆ సెంటిమెంట్ మీదే నడుస్తుందట. ఇక ‘లియో’తో పాటుగా తెలుగులో దసరా కానుకగా విడుదలవుతున్న బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’లో తండ్రీ కూతుళ్లు సెంటిమెంటే కథా వస్తువుగా ఉండబోతోంది.
శ్రీలీల బాలయ్యకు కూతురేనా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. ఇద్దరిదీ తండ్రీ కూతుళ్ల బంధం లాగే కనిపిస్తోంది. ఆడబిడ్డను బలంగా తయారు చేయాలని చూసే తండ్రి.. ఆ బిడ్డకు కష్టం వస్తే ఎలా ఎదురు నిలిచి పోరాడాడనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఇక డిసెంబర్లో రిలీజ్ కానున్న నాని మూవీ ‘హాయ్ నాన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా టైటిల్ చూసినపుడే ఇది తండ్రీ కూతుళ్ల బంధం నేపథ్యంలో నడిచే సినిమా అని అర్థమైంది.
తాజాగా రిలీజైన టీజర్ కూడా ఆ ఎమోషనే ప్రధానంగా సాగింది. దీని తర్వాత సంక్రాంతికి రిలీజయ్యే రెండు చిత్రాల్లో ఫాదర్ సెంటిమెంట్ కీలకం అని తెలుస్తోంది. వెంకటేష్ మూవీ ‘సైంధవ్’లో తండ్రి-కూతురు సెంటిమెంట్ ఉంది. అప్పుడే రిలీజ్ కానున్న విజయ్ దేవరకొండ సినిమాలోనూ తండ్రి-బిడ్డ బంధం ప్రధానంగా ఉంటుందట. ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. దీని టీజర్ బయటికి వస్తే సినిమా మీద పూర్తి ఐడియా వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తండ్రి-బిడ్డ ఎమోషన్ ప్రేక్షకులను ముంచెత్తబోతోందన్నమాట.
This post was last modified on October 15, 2023 3:53 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…