Movie News

నాని వచ్చాడు.. ఖాళీ చేసేదెవరు?

గత వారం ఒకేసారి అరడజను సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీతో రావడం కొన్ని సినిమాలకు బాగా నెగెటివ్ అయింది. ‘చిన్నా’ లాంటి మంచి సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. ఒక్క ‘మ్యాడ్’ మాత్రమే అవకాశాన్ని ఉపయోగించుకుంది. మిగతా సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. వీటిలో రెండు మూడు సినిమాలు ఖాళీగా ఉన్న ఈ వీకెండ్‌లో రిలీజై ఉంటే కొంత మెరుగైన ఫలితం ఉండేదేమో.

సంక్రాంతి, దసరా లాంటి సీజన్లలో తప్పితే ఒకే వారం రెండుకు మించి సినిమాలు రిలీజైతే ఇబ్బందిగానే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా డిసెంబరు రెండో వారానికి వరుసగా సినిమాలను రేసులో నిలబెట్టేస్తున్నారు. ముందుగా ఆ వీకెండ్‌కు వరుణ్ తేజ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ను షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత విశ్వక్సేన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రేసులోకి వచ్చింది.

ఈ మధ్య ‘సలార్’ క్రిస్మస్‌కి షెడ్యూల్ అవ్వగానే.. ఆ టైంలో రావాల్సిన రెండు చిత్రాలను డిసెంబరు రెండో వారానికి తీసుకొచ్చారు. ఆల్రెడీ నితిన్ మూవీ ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’ను డిసెంబరు 8కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని మూవీ ‘హాయ్ నాన్న’కు డిసెంబరు 7ను రిలీజ్ కోసం ఎంచుకున్నారు. ఐతే ఒక వీకెండ్లో ఇలాంటి నాలుగు పేరున్న సినిమాలను రిలీజ్ చేయడం అంటే చాలా కష్టమే. థియేటర్ల సర్దుబాటు అంత ఈజీ కాదు. దీనికి తోడు.. వసూళ్లలోనూ కోత ఉంటుంది. టాక్ తేడా వచ్చిన సినిమాలు దారుణంగా దెబ్బ తింటాయి. కాబట్టి రెండుకు మించి సినిమాలు రిలీజ్ చేయడం కష్టమే.

అతి కష్టం మీద ఇంకో సినిమాకు ఛాన్స్ ఉంటుంది. అది కూడా రిస్కే. కాబట్టి ఒకట్రెండు సినిమాలను వాయిదా వేయక తప్పదు. ఐతే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని డిసెంబరు 24కు వాయిదా వేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ‘సలార్’తో పాటు ‘డుంకి’ కూడా అప్పుడే రిలీజ్ కాబోతున్నాయి. వాటి మధ్య వెళ్తే శాండ్‌విచ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మరి విశ్వక్ అండ్ టీం ఏం చేస్తుందో చూడాలి.  ఇంకోవైపు పరిస్థితిని బట్టి ఎక్స్‌ట్రా, ఆపరేషన్ వేలంటైన్‌ల్లో ఒకటి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నాని సినిమా మాత్రం పక్కాగా డిసెంబరు 7నే వస్తుందని సమాచారం.

This post was last modified on October 15, 2023 2:33 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago