న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుని హాయ్ నాన్నగా రాబోతున్నాడు. ఊర మాస్ తర్వాత అదే పనిగా క్లాస్ ఎమోషన్ ఎంచుకున్న నాని ఈ ప్రాజెక్టు మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన హాయ్ నాన్న పాప సెంటిమెంట్ కీలక పాత్ర పోషించనుంది. డిసెంబర్ 22 నుంచి 7కి ప్రీ పోన్ చేసుకున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. వంద సెకండ్లే ఉన్నప్పటికీ కంటెంట్ లోని ఫీల్ ని ఆడియెన్స్ కి చేరేలా చూసుకున్నారు.
గారాల కూతురే(బేబీ కియారా) ప్రాణంగా బ్రతికే ఒక నాన్న(నాని). పాదం కందిపోకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. తల్లి లేని లోటు తెలియనంత గొప్పగా పెంపకమంటే ఏంటో చూపిస్తాడు. వీళ్ళ మధ్య ఓ అమ్మాయి కృష్ణ(మృణాల్ ఠాకూర్)వస్తుంది. తొలుత స్నేహంగా మొదలై క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే ఆమెకు అప్పటికే పెళ్లి నిశ్చయమైన సంగతి తెలుసుకున్న ఆ నాన్న గుండె బద్దలై నిలదీస్తాడు. కానీ అంతకు మించి ఘాడమైన బంధం వాళ్ళిద్దరితో పాటు పాపకు కూడా అల్లుకుందన్న సంగతి గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరమీద చూడమంటున్నారు.
సింపుల్ కాన్సెప్ట్ తో హాయిగా అనిపించే ఎమోషనల్ విజువల్స్ తో దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్నని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. హీరో హీరోయిన్ పాపతో పాటు జయరాం ని తప్ప ఇంకే క్యాస్టింగ్ ని టీజర్ లో రివీల్ చేయలేదు. హేశం అబ్దుల్ వహాబ్ మార్కు నేపధ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ లో ఇంపుగా సాగింది. స్టోరీ పరంగా మరీ కొత్తగా అనిపించకపోయినా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని చక్కగా డీల్ చేసిన శౌర్యువ్ ఇందులో చెప్పని కొన్ని అంశాలు దాచి ఉంచినట్టు అనిపించింది. డిసెంబర్ 7న థియేటర్లలో అడుగుపెట్టబోతున హాయ్ నాన్న ఈ భావోద్వేగాలతో కనెక్ట్ చేయగలిగితే జెర్సీని మించే విజయం దక్కినట్టే
This post was last modified on October 15, 2023 11:37 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…