ఈ రోజుల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. ఒక దశ వరకు కొంచెం లిమిటేషన్లు పెట్టుకునే హీరోయిన్లు కూడా తర్వాత మారిపోతుంటారు. కానీ 30-40 ఏళ్ల ముందు పరిస్థితులు ఇలా ఉండేవి కావు. హీరోయిన్లు రొమాన్స్ విషయంలో హద్దులు పాటించేవారు. అందాల ప్రదర్శనలోనూ శ్రుతి మించే వారు కాదు. సౌత్ ఇండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సుహాసిని.. ఏ సినిమాలోనూ గ్లామరస్‌గా కనిపించింది లేదు.
తనకంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని.. ఆ ప్రకారమే సినిమాలు చేసేది. అలాంటి కథానాయికను ఒక సినిమాలో హీరో ఒళ్లో కూర్చోమని డైరెక్టర్ చెప్పారట. తాను ఆ సన్నివేశం చేయనంటే చేయనని తేల్చి చెప్పేసిందట సుహాసిని. ఓ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తాను ఇలాంటి సన్నివేశాల విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదాన్నో ఆమె వివరించింది.
‘‘ఒక సినిమా సెట్లో నేను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా. ఒక సీన్లో భాగంగా హీరో ఒళ్లో కూర్చోమని నాకు చెప్పారు. నేను అంగీకరించలేదు. ’ఇది ఇండియా, పరాయి వ్యక్తి ఒడిలో ఒక స్త్రీ కూర్చోవడం తప్పు. కాబట్టి నేనా సీన్ చేయను’ అని గట్టిగా వాదించా. దీంతో ఆ సీన్ మార్చారు. ఇంకో సినిమాలో పాట చిత్రీకరణ సందర్భంగా హీరో తిన్న ఐస్‌క్రీమ్‌నే నన్నూ తినమన్నారు. అది నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి సీన్ మార్చండి అని తేల్చి చెప్పా. నా మాటలు విని కొరియోగ్రాఫర్ షాకయ్యాడు.
తాను చెప్పినట్లు చేయాలన్నారు. నేను అంగీకరించలేదు. ఆ ఐస్‌క్రీమ్‌ను కనీసం ముట్టుకోనని తెగేసి చెప్పా. నా ఫ్రెండ్ శోభనకు ఒక సినిమాలో ఇలాంటి పరిస్థితే ఎదురైతే, ఆమె ఆ సీన్ చేయనని చెప్పిందట. అందుకా దర్శకుడు ‘నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా.. చేయనని చెబుతున్నావ్’ అని అడిగాడట. ఆమె వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను ఇలాంటి సీన్లు చేయనని అందరికీ అర్థమైందని అప్పుడు తెలిసింది’’ అని సుహాసిని ఆ సంగతులు గుర్తు చేసుకుంది.
This post was last modified on October 15, 2023 9:44 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…