ఎఫ్3 తర్వాత పెద్దగా కనిపించకుండా పోయిన మెహ్రీన్ హీరోయిన్ గా ఒక కొత్త హీరోతో సినిమా వస్తోందంటే విశేషమే. అదే స్పార్క్ లైఫ్. టైటిల్ ఏదో వెరైటీగా ఉన్నా కథానాయకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ సెటప్ మాత్రం భారీగా కనిపిస్తోంది. నవంబర్ 17 విడుదల కాబోతున్న ఈ క్రైమ్ కం లవ్ థ్రిల్లర్ కి దర్శకుడి పేరు లేదు. బ్యానర్ పేరు మీదే ఏ ఫిలిం బై అని వేసుకున్నారు కానీ కథ స్క్రీన్ ప్లే సమకూర్చింది మాత్రం విక్రాంతే. ఖుషి, హాయ్ నాన్నలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం అందించడం విశేషం. మూడు నిమిషాల ట్రైలర్ ఇందాక లాంచ్ చేశారు.
జీవితంలో ఎన్నో కలలు ఏదో సాధించాలనే తపనతో ఉన్న కుర్రాడు(విక్రాంత్) తొలిచూపులోనే ఓ అమ్మాయి(రుక్సర్ ధిల్లాన్) ని ఇష్టపడి ప్రేమించడం మొదలుపెడతాడు. ఇతని వెనుక మరో లవర్(మెహ్రీన్) వెంటపడుతుంది. ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వెళ్తున్న క్రమంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరిగి ఆ అబ్బాయి దారుణంగా అమ్మాయిలను హత్య చేసే కిల్లరని బయట పడుతుంది. పోలీసులు పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. ఇక్కడి నుంచి హింస ఇంకో స్థాయిలో వెళ్తుంది. కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలు తోడవుతాయి. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవడమే స్పార్క్ లైఫ్.
విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ వేల్యూస్ చాలా భారీగా ఖర్చు పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నాజర్, సుహాసిని, బ్రహ్మాజీ, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర ఇలా పెద్ద క్యాస్టింగ్ నే పెట్టుకున్నారు. హేశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అశోక్ కుమార్ ఛాయాగ్రహణం క్వాలిటీని ఇంకాస్త పైకి తీసుకెళ్లాయి. స్టార్ హీరో రేంజ్ లో ఇంత బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యుఎస్ లో జాబ్ చేస్తున్న విక్రాంత్ నటన మీద ఆసక్తితో ఈ స్పార్క్ తీశానని పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. కంటెంట్ విభిన్నంగా ఉంది. ఇతని నటనతో పాటు కంటెంట్ ని జడ్జ్ చేయాలంటే ఇంకో నెల ఆగాలి.
This post was last modified on October 14, 2023 7:04 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…