మన దేశంలో ఒరిజినల్ ఐమ్యాక్స్ ఫార్మట్ లో ఉన్న స్క్రీన్లు కేవలం 23 మాత్రమే అంటే ఆశ్చర్యం కలగక మానదు కానీ ఇది అక్షరాలా నిజం. త్వరలో తిరువనంతపురంలో మరొకటి ప్రారంభం కానుంది. సినిమా లవర్స్ ఎక్కువగా ఉండే రాష్ట్రాలుగా పేరున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్కటి లేదు. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్, సూళూరుపేట వి ఎపిక్ స్క్రీన్ లు చాలా పెద్దవే కానీ వాటిలో ఉన్న ప్రొజెక్షన్ ఐమ్యాక్స్ కాదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే లియో ఐమాక్స్ ప్రింట్లు సకాలంలో చేయని కారణంగా ఓవర్సీస్ లో షెడ్యూల్ చేసిన షోలు రద్దు చేశారు. అడ్వాన్స్ అమ్మిన టికెట్ డబ్బులు రీ ఫండ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇండియాలో వేయడం కూడా అనుమానమే. ఐమ్యాక్స్ టెక్నాలజీలో సినిమా తీయాలంటే దానికి అనుగుణమైన కెమెరానే వాడాలి. లేదూ తీసిన దాన్ని ఆ ఫార్మట్ లో మార్చాలంటే ప్రత్యేకంగా ఆ ప్రింట్ కోసం వర్క్ చేయించాలి. నెలల తరబడి సమయం పడుతుంది. ఇదంత సులభం కాదు. ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓవర్సీస్ లో విదేశీయులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. పఠాన్ సైతం లార్జ్ వెర్షన్ అంటూ యష్ రాజ్ ఫిలిమ్స్ ఊదరగొట్టింది కానీ తీరా థియేటర్ కు వెళ్లి చూస్తే స్క్రీన్ కు పైన కింద నల్లని బార్లు వెక్కిరించాయి.
రాబోయే టైగర్ 3 కూడా ఇలాగే ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. నిఖార్సైన ఐమ్యాక్స్ మూవీస్ అంటే ఓపెన్ హీమర్, గ్రావిటీ లాంటి వాటిని చెప్పుకోవచ్చు. అయినా మన సాంకేతికత ఆ స్థాయిలో పెరగనప్పుడు అనవసరంగా ప్రేక్షకులను ఊరించడం తప్పే అవుతుంది. కేవలం ఈ ఎక్స్ పీరియన్స్ కోసమే యుఎస్, యుకెలో లియో టికెట్లు ఏడు వేలకు పైగా అమ్ముడుపోయాయట. ఆ సొమ్ములన్నీ వెనక్కు ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ దాని వల్ల ఆడియన్స్ అసంతృప్తిని ఎంత డబ్బిచ్చినా తగ్గించలేం. ముందుగా మన దేశంలో స్క్రీన్ కౌంట్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది.
This post was last modified on October 14, 2023 11:15 am
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…