అక్కినేని యువ కథానాయకుడు అఖిల్‌కు అరంగేట్రానికి ముందు ఉన్న క్రేజ్.. ఆ తర్వాత లేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య హీరోగా అరంగేట్రం చేసిన అతను.. తొలి సినిమా అఖిల్, ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ముందున్న క్రేజ్ మొత్తం కోల్పోయాడు. ఇప్పుడు స్టార్‌గా ఎదగడం కంటే హిట్టు కొట్టి హీరోగా నిలబడితే చాలు అనే స్థితిలో ఉన్నాడతను.
ప్రస్తుతం అతను గీతా ఆర్ట్స్ బేనర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే ఈ సినిమా విడుదలయ్యేది, దాని ఫలితమేంటో తేలిపోయేది. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచించేవాడేమో అఖిల్. కానీ ఆ సినిమా విడుదల వాయిదా పడింది.
లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉన్న నాగార్జున.. చిన్న కొడుకు కోసం కొత్త సినిమా సెట్ చేశాడు. సైరా లాంటి భారీ చిత్రం తీసిన సురేందర్ రెడ్డి అఖిల్‌తో తర్వాతి సినిమా చేయడానికి రెడీ అవడం విశేషం. ఈ చిత్రాన్ని క్రిష్ సన్నిహితుల ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ సురేందర్ దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ చెప్పడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు వారి స్థానంలోకి 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట వచ్చినట్లు సమాచారం. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉన్న వీళ్లు.. ఆ చిత్రం వాయిదా పడటంతో దాని స్థానంలో అఖిల్ సినిమాను టేకప్ చేయడానికి రెడీ అయ్యారట. నాగ్ ప్రమేయంతోనే వాళ్లు ఈ సినిమాకు ఓకే చెప్పారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
This post was last modified on August 26, 2020 2:59 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…