‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్: చాప్టర్-2’నే. ‘బాహుబలి: ది బిగినింగ్’ స్థాయిలో కాకపోయినా.. ‘కేజీఎఫ్: చాప్టర్-1’ కూడా మంచి విజయమే సాధించింది. వివిధ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దీంతో ‘చాప్టర్-2’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ సినిమా ఈపాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.
కానీ కరోనా వచ్చి ఆరు నెలల పాటు పనంతా ఆపేసింది. ఇప్పటికీ చాలామంది షూటింగ్‌లు చేయడానికి వెనుకాడుతుంటే.. ‘కేజీఎఫ్-2’ టీం మాత్రం ధైర్యంగా అడుగు ముందుకేసింది. బుధవారమే ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయింది. ఇండియాలో చిత్రీకరణ పున:ప్రారంభించిన తొలి భారీ చిత్రం ఇదే.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్.. క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి వెల్లడించాడు. ‘కేజీఎఫ్-2’ షూటింగ్ పున:ప్రారంభం అయింది ప్రకాష్ రాజ్‌పై సన్నివేశాలతోనే కావడం విశేషం. ఆయనకు సీన్ పేపర్ ఇచ్చి సన్నివేశం గురించి వివరిస్తున్న ఫొటోలను ప్రశాంత్ షేర్ చేశాడు. సూటేసుకుని జెంటిల్మన్ లాగా కనిపిస్తున్నాడు ప్రకాష్. ఆయన అవతారం చూస్తే ‘చాప్టర్-1’లో అనంత్ నాగ్ చేసిన నరేటర్ పాత్రను ఈసారి ఈయన చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
దాదాపుగా అదే స్టయిల్లో కూర్చున్న స్టిల్ ఒకటి వదిలారు. ఇదే నిజమైతే హీరో ఎలివేషన్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. కన్నడేతర భాషల వాళ్లు మరింతగా ఈ పాత్రతో కనెక్టవుతారనడంలో సందేహం లేదు. ‘కేజీఎఫ్-2’లో హీరో తర్వాత అందరి దృష్టీ సంజయ్ దత్ పాత్ర మీదే ఉంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా లైన్లోకి రావడం సినిమా మీద అంచనాలు మరింత పెంచేదే. ఈ చిత్రంలో ఇందిరా గాంధీని పోలిన ప్రధాని పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నట్లు సమాచారం.
This post was last modified on August 26, 2020 2:55 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…