Movie News

సలార్ కు దారివ్వబోతున్న డుంకీ ?

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన ప్రభాస్ VS షారుఖ్ ఖాన్ క్లాష్ లో కొత్త మలుపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 22 రెండు సినిమాలు పరస్పరం తలపడబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా డుంకీ రేస్ నుంచి తప్పుకోవచ్చంటూ బాలీవుడ్ మీడియా గట్టిగానే చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి నెల ఆప్షన్ చూస్తున్నారట. ఒకవేళ హృతిక్ రోషన్ ఫైటర్ కనక జనవరి 25న ఏదైనా కారణం వల్ల రాలేని పరిస్థితిలో ఉంటే ఆ డేట్ ని డుంకీకి సెట్ చేయాలనే దిశగా సీరియస్ గానే చర్చలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.

డుంకీ ఇప్పటిదాకా బిజినెస్ డీల్స్ ని పూర్తి స్థాయిలో ముగించలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయ్యారు కానీ ఇంకా స్క్రీన్లను లాక్ చేసుకునే తతంగం మొదలుపెట్టలేదు. మరోవైపు సలార్ ఇప్పటికే వందల్లో థియేటర్లను బుక్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో రెడీగా ఉంది. ఇండియాలో పంపిణీదారులకు సైతం ఇంకా షారుఖ్ బృందం నుంచి ఖచ్చితమైన సమాచారం అందటం లేదు. ప్రభాస్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మూడు సినిమాలు తీసిన టి సిరీస్ అధినేతలు డుంకీ పోస్ట్ పోన్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తునట్టు మరో కామెంట్ వినిపిస్తోంది. ఇవన్నీ తెరవెనుక జరిగే వ్యవహారాలు.

కాబట్టి డుంకీ తప్పుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే షారుఖ్ ఇంకా అంగీకరించలేదని తెలిసింది. ఇప్పుడు వెనక్కు తగ్గితే సలార్ కు భయపడేననే ప్రచారం వస్తుంది కాబట్టి అలా జరగకుండా ఏం చేయాలో చూస్తున్నారట. వాస్తవంగా డుంకీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. చేతిలో ఉన్న డెబ్భై రోజుల్లో అన్ని పూర్తి చేయడం చాలా కష్టమని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ భావిస్తున్నట్టు వినికిడి. సో ఒకవేళ అదే జరిగితే సలార్ ఊచకోతకు మరో ఆయుధం దొరికినట్టే. సోలో రిలీజ్ ను వాడుకుని ఊహించని స్థాయిలో ప్యాన్ ఇండియా రికార్డులు నమోదు చేయవచ్చు. చూద్దాం

This post was last modified on October 13, 2023 10:57 am

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago