Movie News

మీడియం రేంజ్ హీరో జోడిగా రష్మిక

ఒక దశలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ కుర్చీని అలవోకగా అందుకుంటుందని ఆశించిన రష్మిక మందన్న అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా అందినట్టే అందకుండా పోయింది. అయినా సరే బాలీవుడ్ లో గట్టి జెండా పాతాలని నిర్ణయించుకున్న రష్మిక అనిమల్ లో రన్బీర్ కపూర్ తో హాట్ రొమాన్స్ కి అభ్యంతరం పెట్టకుండా బోలెడు లిప్ లాక్స్ కి ఎస్ చెప్పింది. మనం మొన్న చూసిన పాటలో వచ్చింది శాంపిల్ మాత్రమే. వయొలెన్స్, లవ్ రెండు మిక్స్ చేసిన ఫస్ట్ నైట్ సీన్ దర్శకుడు సందీప్ వంగా ఓ రేంజ్ లో షూట్ చేశాడని ఆల్రెడీ టాక్ ఉంది.

ఇక అసలు పాయింట్ కు వస్తే రష్మిక మందన్న తాజాగా ఓ మీడియం రేంజ్ హీరోతో జోడి కట్టనుంది. అతనే విక్కీ కౌశల్. కెరీర్లో మంచి హిట్లు ఉన్నప్పటికీ ఇతగాడు ఇంకా టాప్ లీగ్ లోకి చేరుకోలేదు. ఉరి లాంటి బ్లాక్ బస్టర్లు రెగ్యులర్ గా పడటం లేదు. కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాక ఒక హిట్టు ఒక డిజాస్టర్ పలకరించాయి. తాజాగా ఒక పీరియాడిక్ డ్రామాని చేయబోతున్నాడు. చావా ది గ్రేట్ వారియర్ లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. జయసింగ్ రావు రాసిన సుప్రసిద్ధ మరాఠి నవల ఆధారంగా రాహుల్ జనార్దన్ జాదవ్ దర్శకత్వంలో రూపొందనుంది. అక్టోబర్ 16 నుంచి షూటింగ్ ఉంటుందట.

తన పక్కన చేస్తున్న హీరో స్టేటస్ కన్నా బడ్జెట్, స్కేల్, కాన్వాస్ ని ఎక్కువగా చూస్తున్న రష్మిక మందన్నకు ఇది మొదటి పీరియాడిక్ మూవీ అవుతుంది. బడ్జెట్ నూటా యాభై కోట్లకు పైమాటే అంటున్నారు. అనిమల్ ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి ఆలోగా మరికొన్ని ఇలాంటి క్రేజీ ప్రోజెక్టులకు సైన్ చేస్తే మెల్లగా షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్లతో జోడి కట్టొచ్చు. సౌత్ విషయాన్ని వస్తే పుష్ప 2 ది రూల్, రైన్ బోతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పింది. మొత్తానికి డైరీ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్ తో రష్మిక మందన్న జోడి కడుతున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఒక్కడే ప్యాన్ ఇండియా హీరో. 

This post was last modified on October 12, 2023 6:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago