సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉందంటే.. బాక్సాఫీస్ దగ్గర పోటీకి వెళ్లడానికి వేరే చిత్రాల మేకర్స్ భయపడతారు. సంక్రాంతి టైంలో ఒకటికి మించి పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రమే మహేష్ సినిమాకు ఎవరైనా ఎదురు వెళ్తారు. అది కూడా భారీ చిత్రాలకు మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. ఐతే మహేష్ కొత్త సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయినప్పటికీ.. అరడజను సినిమాల దాకా రేసులోకి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్.
మహేష్‌తో తీస్తున్న ‘గుంటూరు కారం’ను చూసి వేరే సినిమాలు భయపడకపోవడం షాకింగే. హనుమాన్, ఈగల్, నా సామిరంగా, సైంధవ్ ఆల్రెడీ సంక్రాంతి డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యలో వేర్వేరు సినిమాలను సంక్రాంతి రిలీజ్ చేసే సంకేతాలు కనిపించాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ‘గుంటూరు కారం’కు పోటీగా నాలుగు మిడ్ రేంజ్ చిత్రాలను రేసులో నిలబెట్టడం మాత్రం మహేష్ సినిమా మేకర్స్‌కు మింగుడు పడకపోయి ఉండొచ్చు.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెగెటివ్ న్యూస్‌ల వల్ల బజ్ తగ్గిన మాట వాస్తవం. అసలు ఈ చిత్రం సంక్రాంతికి రాదేమో అన్న సందేహాలు కూడా వేరే చిత్రాలకు ధైర్యాన్నిచ్చాయి. ఐతే ఈ సినిమా నూటికి నూరు శాతం సంక్రాంతికి వస్తుందని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ల పరంగా చేయాల్సినంత చేయలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఈ విషయం టీంకు కూడా తెలుసు. అందుకే షూటింగ్ మెజారిటీ పూర్తయ్యాక సంక్రాంతి లక్ష్యంగా ప్రమోషన్లను హోరెత్తించాలని టీం భావిస్తోందట.
ముందుగా దసరాకు ఈ సినిమా నుంచి తొలి పాటను లాంచ్ చేస్తారట. తర్వాత నెల గ్యాప్ ఇచ్చి విడదులకు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం అప్‌డేట్స్‌తో హోరెత్తించబోతోందట చిత్ర బృందం. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ పవర్ ప్యాక్డ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తారని ఆ కంటెంట్ ఒక్కొక్కటి బయటికి రావడం మొదలైతే ‘గుంటూరు కారం’ను చూసి అందరూ భయపడటం ఖాయమని.. అప్పుడు ఒకట్రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి కూడా తప్పుకుంటాయని అంచనా వేస్తున్నారట. ప్రస్తుతానికి చిత్ర బృందం దృష్టంతా వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం మీదే ఉన్నట్లు సమాచారం.
This post was last modified on October 12, 2023 6:55 pm
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…