దసరా పండగకు మనం మూడు సినిమాల మీద దృష్టి పెట్టాం కానీ కథ అక్కడితో అయిపోలేదు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలకు థియేటర్లకు సర్దుబాదు చేయడమే పెద్ద తలనెప్పిగా మారిన తరుణంలో అదనంగా వచ్చి చేరిన బాలీవుడ్ మూవీ గణపథ్ నుంచి మల్టీప్లెక్సుల పరంగా ముప్పు తప్పేలా లేదు. అయితే వీటికి ఏ మాత్రం తీసిపోని బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిన కన్నడ చిత్రం ఘోస్ట్ సైతం ప్యాన్ ఇండియా రిలీజ్ అక్టోబర్ 20 ప్లాన్ చేసుకుంది. జైలర్ లో నరసింహగా అదరగొట్టిన శివరాజ్ కుమార్ హీరో కావడంతో ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్ల నుంచి బాగానే డిమాండ్ ఉందట.
కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. ముందురోజు అర్ధరాత్రి నుంచే షోలు వేసే రేంజ్ లో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. కానీ తెలుగు తమిళంలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో అక్టోబర్ 27 వాయిదా పడే ఆలోచనలో నిర్మాతలున్నారు. ఇప్పటికైతే కన్నడ వెర్షన్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. థియేటర్లు కేటాయించారు. కానీ రిస్క్ ఏంటంటే టాక్ బయటికి వస్తుంది. డబ్బింగ్ రిలీజయ్యే నాటికి దాని గురించి ఆడియన్స్ కి అవగాహన వచ్చేసి ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఏ మాత్రం యావరేజ్ అయినా సరే మన ఆడియన్స్ ఆసక్తి చూపించరు.
అందుకే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి. ఘోస్ట్ కోసం శివరాజ్ కుమార్ చాలా కష్టపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మేకప్ వేసుకుని నటించి దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వయసు తగ్గించేలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తీరా చూస్తే పోటీ వల్ల ఒకేసారి అందరికీ చూపించలేకపోతున్నారు. ఘోస్ట్ తెలుగు హక్కులు ఎవరు కొన్నది ఇంకా తెలియలేదు. బాలయ్య, రవితేజ, విజయ్ లతో పోల్చుకుంటే శివన్నకు మన దగ్గర ముందు నుంచి మార్కెట్ లేదు. ఘోస్ట్ నుంచి అది వస్తుందని ఆశపడితే ఇదిగో ఇలా కాంపిటీషన్ తలనెప్పి వచ్చి పడింది. పోస్ట్ పోన్ తప్పేలా లేదు మరి.
This post was last modified on October 11, 2023 4:23 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…