దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేమైనా హింసయినా ప్రేక్షకుల మెదళ్లలోకి బలంగా జొప్పించేందుకే చూస్తాడు. అర్జున్ రెడ్డి విడుదలకు ముందు విజయ్ దేవరకొండ, షాలిని పాండేల లిప్ లాక్ కిస్సుతో వదిలిన పోస్టర్ ఎంత రచ్చ చేసిందో ఆ ప్రమోషన్లు ప్రత్యక్షంగా చూసినవాళ్లకు బాగా గుర్తే. తర్వాత కబీర్ సింగ్ దీనికి రీమేక్ కాబట్టి అందులోనూ రిపీట్ అయ్యింది. ఫ్రెష్ గా అనిమల్ లో రన్బీర్ కపూర్, రష్మిక మందన్నల మధ్య పెట్టిన అధర చుంబనాలు నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉండటం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళే అన్ని భాషల్లో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.
పాట ప్రారంభంలో ఈ జంటను ఉద్దేశించి అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు రన్బీర్ ని నిలదీయడం, దానికి బదులు ఈ ఇద్దరూ ఘాడంగా పెదాలతో రొమాన్స్ చేయడంతోనే సందీప్ మార్కు మొదలైపోయింది. ఆ తర్వాత ఫ్లైట్ కాక్ పిట్, జీప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా క్రమం తప్పకుండ ముద్దులను కొనసాగిస్తూనే వచ్చారు. ఉన్న రెండున్నర నిమిషాల పాటలో కొన్ని డైలాగులు, మంచు కొండల్లో ఉన్న గుడి దగ్గర పెళ్లి చేసుకోవడం మినహాయించి మొత్తం రన్బీర్ రష్మికల మధ్య రొమాన్స్ తో గడిచిపోయింది. జామ్8 సంగీతం సమకూర్చిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు.
దీన్ని బట్టి సందీప్ వంగా ఒక స్పష్టత ఇచ్చాడు. లవ్, వయొలెన్స్ ఇందులో ఊహించని స్థాయిలో ఉంటాయని ముందే వచ్చిన లీక్ కు తగ్గట్టుగానే టీజర్, మొదటి పాటని డిజైన్ చేయించారు. ఇంకా ట్రైలర్, మిగిలిన సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కష్టమే. డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో ఫ్యాన్స్ మాములు ఆశలు పెట్టుకోలేదు. అటు రష్మిక సైతం బాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఇది పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
This post was last modified on October 11, 2023 1:54 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…