ఒక సినిమా అవుట్ ఫుట్ లో నేపధ్య సంగీతంది చాలా కీలక పాత్ర. సీన్స్ ని ఎన్నో రెట్లు ఎలివేట్ చేస్తూ తర్వాత స్థాయికి తీసుకెళ్లడం అందరికీ సాధ్యం కాదు. ఇటీవలే జైలర్ కు అనిరుద్ రవిచందర్ ఎంత ప్రాణం పోశాడో స్వయంగా రజనీకాంత్ ఒప్పుకున్నారు. తాను యావరేజ్ అనుకున్నది రీ రికార్డింగ్ తర్వాత బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఇచ్చిందని ఓపెన్ గా చెప్పారు. నాగార్జున శివ, భానుప్రియ సితార, వంశీ అన్వేషణ లాంటివి కేవలం డైలాగులతో చూడటం చాలా కష్టం. ఇళయరాజా పనితనం వల్లే ఆడియన్స్ కి అవి నెక్స్ట్ లెవెల్ లో అనిపించిన మాట వాస్తవం. ఇక విషయానికి వద్దాం.
తమన్ హఠాత్తుగా అరవింద సమేత వీర రాఘవ జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నాడు. దాని రీ రికార్డింగ్ కోసం ఎంతగా కష్టపడింది, డాల్బీ మిక్సింగ్ తో ఇంట్రో సీన్, యాడబోయినావురో పాట కోసం పడిన శ్రమని స్టూడియోలో తీసిన వీడియోలతో పాటుగా షేర్ చేశాడు. ఇది ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఒకటే కారణం కనిపిస్తోంది. ఇటీవలే బోయపాటి శీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖండని బిజిఎం లేకుండా చూసినా అదే గూస్ బంప్స్ వస్తాయని, అంత గొప్పగా తాను తీశాను తప్పించి ప్రత్యేకంగా తమన్ వల్ల యాడ్ అయ్యిందేమి లేదన్నట్టు మాట్లాడారు.
దీనికి తమన్ నేరుగా స్పందించలేదు కానీ ఇప్పుడీ ట్వీట్ల ద్వారా తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. ఎవరు ఔనన్నా కాదన్నా అఖండకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా హెల్పైన మాట వాస్తవం. అఘోర పాత్రకు కంపోజ్ చేసిన సిగ్నేచర్ ట్యూన్, శ్లోకాలను వాడుతూ విభిన్న వాయిద్యాలతో తనకు వచ్చిన మొదటి బాలయ్య అవకాశాన్ని తమన్ బ్రహ్మాండంగా వాడుకున్నాడు. స్కంద ఫలితం తేడా కొట్టడం వల్లే బోయపాటి అలా అన్నాడో లేక ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయో తెలియదు కానీ మొత్తానికో హాట్ టాపిక్ అయ్యింది. 2018 యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన అరవింద ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఇప్పుడు షేర్ చేయడంలో ఉద్దేశం ఏమిటో మరి.
This post was last modified on October 11, 2023 11:46 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…