రాజకీయాలలోకి వెళ్లకముందు చిరంజీవి మూడు సినిమాలు చేస్తే, అందులో ఖచ్చితంగా ఒకటి అల్లు అరవింద్ ‘గీతా ఆర్టస్’ది ఒకటి ఉండేది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి ఇంతవరకు అల్లు అరవింద్ బ్యానర్లో సినిమా చేయలేదు. మొదటి రెండు చిత్రాలు రామ్ చరణ్ స్థాపించిన ‘కొణిదెల ప్రొడక్షన్స్’లోనే చేసారు.
ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ చెప్పిన నిర్మాతకు చేస్తోన్న చిరంజీవి తన తదుపరి చిత్రాలను అనిల్ సుంకర, మైత్రి మూవీస్ తదితరులకు చేయబోతున్నారని టాక్. చరణ్‌కి నిర్మాణ వ్యవహారాలు చూసుకునే సమయం లేకపోవడంతో చిరు బయటి బ్యానర్స్కి డేట్స్ ఇస్తున్నారు.
అయితే తన తదుపరి చిత్రాలు మూడు వరకు ఖాయమయినా కానీ ఒక్కటి కూడా అల్లు అరవింద్‌కి చేయకపోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. కేవలం కొణిదెల ప్రొడక్షన్స్ లో మాత్రమే సినిమాలు చేస్తుంటే పట్టించుకునేవాళ్లు కాదేమో కానీ బయటి బ్యానర్లకు డేట్స్ ఇస్తూ కూడా గీతా ఆర్ట్స్ లో ఒక్కటి కూడా ఇంకా అనౌన్స్ కాకపోవడం చర్చకు దారితీసింది.
మరి ఇది అనుకోకుండా అలా జరిగిపోయిందో, లేక గీతా బ్యానర్‌కి చిరంజీవి దూరంగా వుంటున్నారో తెలియదు. ఇదిలావుంటే గీతా ఆర్ట్స్ నుంచి భారీ సినిమాలు తగ్గిపోవడంతో తాను చేస్తోన్న సినిమాల్లో కొన్నిటిని తమ సంస్థతో ఎటాచ్ చేయాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడు. అందుకే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం పట్టుబట్టి మరీ తీసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates