టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్స్ చేసిన హీరోయిన్ త్రిష ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయి నెమ్మదించింది కానీ తమిళంలో మాత్రం ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతోంది. విజయ్ లియోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏరికోరి ఆమెనే తీసుకోవడం ఒక ఉదాహరణ మాత్రమే. పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ తో సహా తన సాటి వాళ్ళను పూర్తిగా డామినేట్ చేసేలా గ్లామర్ తో వావ్ అనిపించడం తనకే చెల్లింది. త్రిషకు హీరోలతో పాటు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా గట్టిగా వస్తున్నాయి. మొన్న శుక్రవారం మంచి అంచనాల మధ్య ది రోడ్ రిలీజయ్యింది.
పెద్దగా పోటీ లేకపోయినా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ది రోడ్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. ఓ హైవేలోని మైలురాయి దగ్గర అంతు చిక్కని రీతిలో కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అవి ప్రమాదాలుగా భావించిన పోలీసులు పట్టించుకోరు. ప్రేమించే భర్త, కొడుకు సరిగా అదే చోట ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయిన మీరా(త్రిష)కు దాని వెనుక ఏదో మిస్టరీ ఉందని అర్థమవుతుంది. ఈ ఘటనకు లైంగిక వేధింపుల కేసు ఎదురుకుంటున్న ఓ టీచర్(షబీర్ కల్లరకల్)కు కనెక్షన్ ఉంటుంది. దీంతో మీరా స్వయంగా అసలు నిజం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతుంది.
లైన్ పరంగా బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు అరుణ్ వశీగరన్ ఫెయిలయ్యాడు. దీంతో సన్నివేశాలు ముందుకు వెళ్లేకొద్దీ కథనం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. ఒక దశ దాటాక హంతుకుడు ఎవరో సులభంగా గుర్తించేలా నెరేట్ చేయడం ఫ్లోని దెబ్బ తీసింది. మంచి థ్రిల్లర్ గా మలిచే స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా అవకాశాన్ని వాడుకోలేదు. రోడ్డు మీద మర్డర్ల కాన్సెప్ట్ కొత్త కాకపోయినా ట్రీట్ మెంట్ కాస్త విభిన్నంగా ఉన్నా పాస్ అయిపోయేది. మరి అక్కడే తిరస్కారానికి గురైన ఈ రహదారిని తెలుగు డబ్బింగ్ వదిలే సాహసం బహుశా ఎవరు చేయరేమో.
This post was last modified on October 10, 2023 11:42 am
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…