దసరా పండక్కు నేనూ వస్తానంటూ బాలీవుడ్ హీరో టైగర్ శ్రోఫ్ తెగ ఉత్సాహపడుతున్నాడు. ఇతగాడి కొత్త సినిమా గణపథ్ అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. హిందీలో ఒకటే అయితే పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు కానీ ప్యాన్ ఇండియా పేరుతో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ సూపర్ 30, కంగనా రౌనత్ క్వీన్ లాంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ తీసిన వికాస్ బహ్ల్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ వచ్చినప్పుడు మన ప్రభాస్ కల్కి కాన్సెప్ట్ లాగే అనిపించింది. కానీ ఇవాళ ట్రైలర్ చూశాక కొత్త డౌట్లు వస్తున్నాయి.
రెండున్నర నిముషాలు పాటు సాగే ట్రైలర్ లో కథతో పాటు బోలెడు కన్ఫ్యూజన్ చూపించారు. చంపడం తప్ప చావడం తెలియని ఒక కారణ జన్ముడు గుడ్డు(టైగర్ శ్రోఫ్). పేదవాడు దోచుకునేవాడి మధ్య అంతరాన్ని తగ్గించే మహత్తరకార్యం మీద దేవుడు పంపించి ఉంటాడు. అయితే మొండిగా అవతలి వాళ్ళను కొట్టడం తప్ప ఇంకేమి తెలియని గుడ్డుకి ఓ అద్భుత ఘట్టం తర్వాత జ్ఞానోదయం కలిగి వినాయకుడి ఆశీర్వాదంతో గణపథ్ గా మారి ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సైన్స్ అరాచక శక్తుల భరతం పట్టే పనికి పూనుకుంటాడు. తర్వాత ఏం జరుగుతోందో తెలిసిందే.
కాన్సెప్ట్ వెరైటీగా ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేవు. పైగా వర్తమానం, భవిష్యత్తు మధ్య ఏదో గందరగోళం పెట్టేసి టైగర్ శ్రోఫ్ హీరోయిజంని ఓవర్ ఎలివేట్ చేసే ప్రయత్నం కనిపించింది. ఉత్తరాది మాస్ జనాలకు ఇదేమైనా కనెక్ట్ కావొచ్చేమో కానీ ఇంతకు మించిన స్టాండర్ తో ఇలాంటివి మనం బోలెడు చూశాం కాబట్టి కొత్తగా అనిపించదు. ఆది పురుష్ సీత కృతి సనన్ సైతం యాక్షన్ ఎపిసోడ్స్ లో భీభత్సమైన స్టంట్లు చేసింది. అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తుండగా ఆయన గెటప్ కొంచెం తేడాగానే ఉంది. మొత్తానికి బాలయ్య, రవితేజ. విజయ్ లను ఢీ కొట్టేంత మ్యాటర్ అయితే లేదు
This post was last modified on October 9, 2023 6:53 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…