కొత్త సినిమాలకు ముందు రోజు.. లేదా రెండు, మూడు రోజుల ముందు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం మామూలే. ఇటీవల ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. సామజవరగమన, బేబి, మ్యాడ్ లాంటి చిత్రాలకు ప్రిమియర్స్ బాగా ప్లస్ అయ్యాయి కూడా. ఈ బాటలో మరో చిన్న సినిమా పెయిడ్ ప్రిమియర్స్‌కు రెడీ అయింది. ఐతే ఆ సినిమాకు ఒకట్రెండు రోజుల ముదు కాదు.. ఏకంగా విడుదలకు 18 రోజుల ముందే ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఆ చిత్రమే.. మార్టిన్ లూథర్ కింగ్.
బర్నింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు లీడ్ రోల్ చేసిన చిత్రమిది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘మండేలా’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేసి నేరుగా రిలీజ్ డేట్‌తో సినిమాను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమాకు ఈ రోజు (సోమవారం) నుంచే పెయిడ్ ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ముందుగా విశాఖపట్నంలోని ఐనాక్స్ థియేటర్లో మార్నింగ్ షోతో ప్రిమియర్ మొదలైంది.
తర్వాతి నాలుగు రోజుల్లో వరుసగా విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్‌లో మార్నింగ్ షోలకు ప్రిమియర్స్ వస్తున్నారు. ఈ షోలకు కాస్ట్ అండ్ క్రూ అంతా హాజరవుతోంది. విడుదల ముంగిట హైదరాబాద్‌లో కూడా కొన్ని షోలు ప్రిమియర్స్‌గా వేస్తారట. విడుదలకు మరీ ఇన్ని రోజుల ముందు ప్రిమియర్స్ పడటం ఎన్నడూ జరిగి ఉండదు. ‘మండేలా’ చాలా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అది ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.
తమిళంలో యోగిబాబు హీరోగా నటించాడు. ఇక్కడ సంపూ ఆ పాత్ర చేస్తున్నాడు. వెంకటేష్ మహా ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడమే కాక క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించాడు. పూజ కొల్లూరు డైరెక్ట్ చేసిన చిత్రమిది. సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్న టీం.. ‘మార్టిన్ లూథర్ కింగ్’ను జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రిమియర్స్ వేస్తోంది. కానీ మరీ ఇంత ముందుగా కాకుండా రిలీజ్ ముంగిట వారం ముందు నుంచి ప్రిమియర్స్ వేస్తే బాగుండేదేమో. కానీ అప్పుడు దసరా సినిమాల సందడి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు.
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…