నిన్న జరిగిన భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. బాలకృష్ణ ప్రసంగిస్తూ ఇంట్లో మోక్షజ్ఞ తన గురించి అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. శ్రీలీలకి జోడిగా నటించాలని తనంటే ఏంటి డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ కొడుకు సెటైర్ వేసాడని బాలయ్య ఓపెన్ గా స్టేజి ముందు వేలాది అభిమానుల సమక్షంలో చెప్పేశారు. నిజానికి మోక్షు ఏ ఉద్దేశంతో ఏ మాట అన్నాడో తెలియదు కానీ ఆ పదం వెనుక అర్థం విశ్లేషించుకున్న వాళ్ళ అబ్బే ఇది చెప్పుకుని ఉండాల్సింది కాదని అంటున్నారు. ఏదైతేనేం బాలయ్య ఇలాంటివి కేర్ చేసే టైపు కాదు కాబట్టి ఉన్నదున్నట్టు మాట్లాడేశారు.
దీనికన్నా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదని అభిమానులు ఫీలవుతున్నారు. అదిగో ఇదిగో అంటూ ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ బాలయ్య వారసుడు తెరమీద రావడం లేదు. ఈ మధ్య బాగా సన్నబడ్డాడు. శిక్షణ తీసుకున్నాడు. లుక్స్ చక్కగా కుదురుతున్నాయి. డైరెక్టర్ కాంబోని ముందు లాక్ చేసుకుంటే షూటింగ్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. కానీ డెబ్యూని హ్యాండిల్ చేసే దర్శకుకు ఎవరనేది మాత్రం బయట పడటం. పూరి జగన్నాధ్, బోయపాటి శీను, అనిల్ రావిపూడి ఇలా రకరకాల పేర్లు తిరుగుతున్నాయి తప్పించి ఫైనల్ ఎవరో తెలియడం లేదు.
సరే ఆన్ లైన్ అన్నాక ఇలాంటి చర్చలు డిబేట్లు బోలెడు జరుగుతుంటాయి కాబట్టి ఒకటి రెండు రోజుల తర్వాత ఇవి మర్చిపోవడం సహజం. ట్రైలర్ లాంచ్ నే ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థాయిలో చేయడంతో మళ్ళీ హైదరాబాద్ లో ఇంకో వేడుక చేయడం అనుమానంగానే ఉంది. రిలీజ్ కు కేవలం పది రోజులే ఉంది. ప్రమోషన్లు వేగవంతం చేయాలి. లియో, టైగర్ నాగేశ్వరరావులతో గట్టి పోటీ ఉండటంతో థియేటర్ల విషయంలో మంచి ప్లానింగ్ అవసరం. ఇబ్బంది రాకుండా చూసుకుంటానని లియో హక్కులు కొన్న నాగవంశీ అన్నప్పటికీ బిజినెస్ దగ్గర పరిస్థితులను ముందస్తుగా అంచనా వేయడం కష్టం.
This post was last modified on October 9, 2023 11:18 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…