Movie News

అదృష్టమంటే ‘మ్యాడ్’దే

తెలుగులో ‘మ్యాడ్’ అనే ఒక సినిమా తెరకెక్కుతున్నట్లు నెలన్నర ముందు వరకు ఎవరికీ తెలియదు. సైలెంటుగా సినిమా మొదలుపెట్టారు. చకచకా చిత్రీకరణ పూర్తి చేశారు. ఫస్ట్ కాపీ కూడా దాదాపు రెడీ చేసేశాక నేరుగా టీజర్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పరిచయం అయింది. యూత్‌ఫుల్‌గా, క్రేజీగా అనిపించిన టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగానే ఆకర్షించింది. ఆ తర్వాత ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.

ఐతే ముందు ‘మ్యాడ్’ను సెప్టెంబరు 28న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ‘సలార్’ బరిలో ఉండగానే ఆ డేట్ ఇవ్వడం విశేషం. ‘సలార్’ వాయిదా పడ్డాక కూడా ఆ డేట్‌కే కట్టుబడి ఉన్నారు కొన్ని రోజులు. ఐతే ‘స్కంద’, ‘చంద్రముఖి-2’, ‘పెదకాపు’ ఇలా ఒక్కసారిగా ఆ వీకెండ్‌కు పోటీ ఎక్కువ అయిపోవడంతో అక్టోబరు 6కు ఫిక్స్ అయింది ఈ టీం. ఐతే ఆ వీకెండ్‌కు పెద్ద సినిమాలు లేవనే కానీ.. పోటీ తక్కువగా ఏమీ లేదు. మామా మశ్చీంద్ర, రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు, 800, చిన్నా.. ఇలా చాలా సినిమాలే రేసులోకి వచ్చాయి.

ఇన్ని సినిమాల మధ్య ప్రేక్షకులు దేన్ని పట్టించుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఐతే ఈ వీకెండ్లో వేరే సినిమాల్లో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడే పరిస్థితి లేదు. ‘చిన్నా’ ఒక్కదానికే మంచి టాక్ వచ్చింది. కానీ అది ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. మిగతా సినిమాల గురించి అసలు మాట్లాడే పరిస్థితే లేదు. గత వారం వచ్చిన ‘స్కంద’; ‘చంద్రముఖి-2’, ‘పెదకాపు’ పూర్తిగా ప్రభావం కోల్పోయాయి. ఈ వారం వచ్చిన సినిమాలేవీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు.

యూత్‌కు బాగా నచ్చే సినిమా కావడంతో ‘మ్యాడ్’దే బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం అయింది. ముందు రోజు ప్రిమియర్లతోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేయగా.. తొలి రోజు ఉదయం నుంచే మంచి స్పందన కనిపించింది. సాయంత్రానికి వసూళ్లు ఇంకా పుంజుకున్నాయి. శనివారం ఈవెనింగ్, నైట్ షోలకు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది ‘మ్యాడ్’. ఆదివారం కూడా సినిమాకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ‘మ్యాడ్’కు ఇంకా కలిసి వచ్చే విషయం ఏంటంటే.. వచ్చే వారానికి చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ రిలీజ్ కావట్లేదు. దసరా వీకెండ్‌కు ముందు వారాన్ని ఖాళీగా వదిలేశారు. దీంతో మ్యాడ్ రెండు వారాల పాటు వసూళ్లు దంచుకోబోతోందన్నమాట. 

This post was last modified on October 8, 2023 4:24 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

1 hour ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago