ప్రస్తుతం ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే పెద్దగా ఆలోచన చేయకుండానే అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ అతడిది. యూత్‌కు కిక్కెక్కించే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అతను థియేటర్లను ఒక ఊపు ఊపేస్తుంటాడు. ఇటీవల ‘జైలర్’ సినిమాతో అతను ఎంత సంచలనం రేపాడో తెలిసిందే. యావరేజ్ మూవీ అయిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ కావడంలో అనిరుధ్ పాటలు, స్కోర్ ముఖ్య పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.
అనిరుధ్ ఏదైనా సినిమా వేడుకకు హాజరైనా.. మ్యూజిక్ కన్సర్ట్ చేసినా.. అక్కడ జనం ఊగిపోయేలా చేస్తాడు. బయట కూడా అనిరుధ్‌కు మాంచి క్రేజ్ కనిపిస్తుంటుంది. ఈ ఫాలోయింగ్, క్రేజ్‌ను ఇంకో రకంగా వాడుకోవడానికి కోలీవుడ్ చూస్తున్నట్లు సమాచారం. అతను హీరోగా ఒక సినిమా రాబోతోందన్నది ఇప్పుడు కోలీవుడ్లో హాట్ న్యూస్.
మాస్టర్, విక్రమ్, లియో.. ఇలా వరుసగా లోకేష్ కనకరాజ్ చిత్రాలకు అనిరుధే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దర్శకుడే తన కథతో అనిరుధ్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నాడట. లోకేష్ చిత్రాలకు అదిరిపోయే రీతిలో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఫైట్ మాస్టర్ ద్వయం అన్బు-అరివు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట. కవలలైన అన్బు అరివు.. ‘అన్బరివు’ అనే ఒకే పేరుతో పాపులర్ అయ్యారు.
‘కబాలి’తో మొదలు ఎన్నో భారీ చిత్రాలకు అదిరిపోయే యాక్సన్ సీక్వెన్సులు చేశారు. ఇటీవలే మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఆర్‌డీఎక్స్’ వాళ్ల పేరు మార్మోగేలా చేసింది. ‘లియో’తోనూ తమదైన ముద్ర వేసేలా ఉన్నారీ ఫైట్ మాస్టర్లు. లోకేష్ కనకరాజ్‌తో వారికి మంచి అనుబంధం ఉంది. వాళ్ల శైలికి తగ్గట్లు మంచి యాక్షన్ కథను రెడీ చేసి ఇవ్వగా.. అనిరుధ్‌తో వాళ్లీ సినిమా తీయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. అనిరుధ్ హీరో కావడం, అది కూడా ఓ యాక్షన్ మూవీతో కావడం ఆసక్తి రేకెత్తించేదే.
This post was last modified on October 8, 2023 2:27 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…