కోలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో ప్రమోషన్ల కోసం ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగంగా ప్రభాస్ తో సినిమా ఉండొచ్చనే సంకేతం మరోసారి ఇచ్చాడు. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఖైదీ లాంటి సింగల్ నైట్ మూవీలో కార్తీతోనే ఓ రేంజ్ హీరోయిజం పండించి ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ లతో అమాంతం స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ లోకేష్ ల కలయిక కార్యరూపం దాల్చడానికి ఊహించనంత పెద్ద టైం పడుతుంది.
అదెలాగో చూద్దాం. లోకేష్ కనగరాజ్ లియో విడుదలయ్యాక అయిదారు నెలలు రజనీకాంత్ 171 స్క్రిప్ట్ మీద పని చేయబోతున్నాడు. అది సంతృప్తి కలిగే దాకా ఒకటి రెండు నెలలు ఎక్స్ ట్రా కూడా అవ్వొచ్చు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వగైరాలు ఎంతలేదన్నా 2024 చివరికి వస్తుంది. ఆ తర్వాత ఖైదీ 2 కన్ఫర్మ్ గా తీస్తానని బల్లగుద్ది చెబుతున్నాడు. ఆపై విక్రమ్ 2 కోసం కమల్ హాసన్ రెడీ అవుతారు. దీనికి కథ ఉంది కానీ ఫుల్ వెర్షన్ డెవలప్ చేయాలి. వీటితో పాటు రోలెక్స్ ని సోలో క్యారెక్టర్ గా మార్చి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. వీటన్నింటిని లోకేష్ యునివర్స్ పేరుతో ముడిపెడతాడు.
ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేసరికి 2028 వస్తుంది. ఆలోగా ప్రభాస్ కల్కి 2, సలార్ 2, మారుతీ సినిమా, సందీప్ వంగా స్పిరిట్ ఫినిష్ చేసుకుని లోకేష్ కోసం ఫ్రీ అవ్వాలి. తనకన్నా ముందు హను రాఘవపూడి వెయిటింగ్ లో ఉన్నాడు. మధ్యలో జరిగే ఆలస్యాలు, వాయిదా పర్వాలు కొత్తగా చెప్పడానికి లేదు. సో ఇవన్నీ లెక్కలేసుకుని చూస్తే 2030 దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఏదైనా అనూహ్య పరిణామం తలెత్తితే తప్ప ముందే మొదలు కావడం అసాధ్యం. సో ఫ్యాన్స్ ప్రాక్టికల్ గా అలోచించి కూల్ అవ్వాల్సింది తప్ప ఏదో ఒకటి రెండు సంవత్సరాలలో ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే.
This post was last modified on October 8, 2023 1:25 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…