Movie News

‘భోళా శంకర్’ తప్పులు చెప్పిన పెద్దాయన

భోళా శంకర్.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక పెద్ద మరకలా మిగిలిపోయిన చిత్రం. చిరు కెరీర్లో డిజాస్టర్లు లేవని కాదు కానీ.. మరీ ఈ స్థాయిలో ప్రేక్షకుల ఛీత్కారానికి గురైన సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదేమో. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురైందని చెప్పొచ్చు. విడుదల తర్వాత నెగెటివిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు.

సినిమా చూడకుండానే బాలేదన్నారంటూ టీం సభ్యులు కొంత ఆవేదన వ్యక్తం చేసినా.. థియేటర్లకు వెళ్లి సినిమా చూడకుండా కామెంట్ చేసిన వాళ్లు కూడా తర్వాత ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి తీవ్రంగా విమర్శించారు. తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమా తెలుగులో మరీ ఇంత దారుణమైన ఫలితం అందుకోవడం ఆశ్చర్యకరం. కొత్త, పాత సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర విశ్లేషణలు చేసే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. ‘భోళా శంకర్’ విషయంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడారు.

కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా కథను నడిపించడం ప్రాథమిక లోపం అని పరుచూరి అన్నారు. కథ అలా మొదలు కాగానే ఇది మన కథ కాదు అనే ఫీలింగ్ తనకు కలిగిందన్నారాయన. మాతృకలో ఎలా ఉన్నప్పటికీ మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయాల్సిందని.. చిత్ర బృందం అలాంటి కసరత్తు చేసినట్లు అనిపించలేదని పరుచూరి పేర్కొన్నారు. ఓవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ మీద హీరో పోరాటం.. మరోపక్క అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ మీద కథను నడిపించారని.. అది రెండు పడవల ప్రయాణంలా కనిపించిందని ఆయనన్నారు.

చిరంజీవి లాంటి అగ్ర హీరోతో నేరుగా హత్యలు చేయించడం చూసి తాను ఉలిక్కిపడ్డానని.. ఇలాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసేటపుడు ముందు ప్రతీకారానికి కారణం చూపించి ఆ తర్వాత హత్యలు చేయించాల్సిందని ఆయనన్నారు. హీరో మీద హీరోయిన్ అంత కోపం పెంచుకోవడం ప్రేక్షకులకు నచ్చదని ఆయనన్నారు. అలాగే చిరంజీవి లాంటి ఇమేజ్ ఉన్న హీరో ఒక అమ్మాయిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ తనను మోసం చేసి ఇల్లు ఖాళీ చేయించడం లాంటి సీన్లు కూడా ప్రేక్షకులకు రుచించవని.. చిరు ఇమేజ్‌కు తగ్గ పాత్ర, కథ ఇవి కావని పరుచూరి అభిప్రాయపడ్డారు. చిరుకు ఒక హీరోయిన్ని పెట్టి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు చూపిస్తే ఈ సినిమా మెరుగ్గా ఉండేదని ఆయనన్నారు.

This post was last modified on October 7, 2023 7:51 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

2 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

6 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

8 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

9 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

9 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

10 hours ago