సంగీత దర్శకుడు తమన్ కెరీర్లోనే బెస్ట్ వర్క్స్‌లో ఒకటిగా ‘అఖండ’ను చెప్పొచ్చు. ఆ సినిమా అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ అతి పెద్ద అసెట్‌గా నిలిచిందనడంలో మరో మాట లేదు. తమన్ ఎంతో తపనతో చేసిన స్కోర్ అది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తీసేసి చూస్తే ఆ సినిమా జనానికి ఆ స్థాయిలో కనెక్ట్ అయ్యేదా అంటే సందేహమే. బాలయ్య అభిమానులే కాక మాస్ ప్రేక్షకులు ఊగిపోయే రేంజిలో ఆ సినిమాకు స్కోర్ ఇచ్చాడు తమన్.
అలాంటిది ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను తమన్ పనితనాన్ని కొంచెం తక్కువ చేసేలా మాట్లాడటం ఈ సంగీత దర్శకుడి అభిమానులకు రుచించడం లేదు. ‘అఖండ’ సినిమాకు తమన్ తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు, ఆ స్కోర్ లేకుంటే సినిమా అంత ఎఫెక్టివ్‌గా ఉండేది కాదేమో అన్న అభిప్రాయాలపై బోయపాటి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
తమన్ సంగీతాన్ని తీసేసి చూసినా కూడా ‘అఖండ’ ప్రేక్షకులకు అంతే ఎగ్జైట్మెంట్ కలిగించేదని.. ఆ సినిమాను చూసి గర్వపడేవాళ్లని బోయపాటి వ్యాఖ్యానించాడు. ఆ కథలో అంత దమ్ము ఉందని బోయపాటి పేర్కొన్నాడు. సినిమాలో అంత విషయం ఉండబట్టే తమన్ కూడా ఎంతో ఇన్‌స్పైర్ అయి నేపథ్య సంగీతం చేశాడని.. ఈ విషయంలో తన క్రెడిట్ తనకు ఇవ్వాల్సిందే అని బోయపాటి వ్యాఖ్యానించాడు.
‘అఖండ’ విషయంలో తమన్ వర్క్‌ను కొనియాడిన వాళ్లే.. ఇప్పుడు ‘స్కంద’ విషయంలో విమర్శిస్తున్నారని.. అది కూడా తన దృష్టికి వచ్చిందని.. ఐతే తాము సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని బోయపాటి అన్నాడు. ‘అఖండ’ విషయంలో తమన్‌ను కొంత పొగుడుతూనే.. తన బ్యాగ్రౌండ్ స్కోర్ లేకున్నా తేడా ఏమీ ఉండేది కాదని బోయపాటి అనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా తమన్ స్కోర్ లేకుంటే ఆ సినిమా అంత ఎఫెక్టివ్‌గా ఉండేది కాదన్నది స్పష్టం.
This post was last modified on October 7, 2023 7:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…