చిన్నదో పెద్దదో ఒక సినిమా విజయానికి చాలా కారణాలుంటాయి. అలాగే ఓటమికి కూడా. రెండూ అంగీకరించాల్సిందే. ఏ దర్శకుడు కావాలని ఫ్లాప్ తీయడు. ఇండస్ట్రీ హిట్టుని అధిక శాతం ముందే ఊహించలేరు. ఫలితాలు కొన్నిసార్లు దైవాధీనాలు. ఫైనల్ గా మాట్లాడేది కంటెంటే. నిన్న విడుదలైన మంత్ అఫ్ మధుకి మిశ్రమం అనడం కంటే సానుకూల స్పందన తక్కువగా వచ్చిన మాట వాస్తవం. అది కలెక్షన్లలో ప్రతిబింబిస్తోంది. ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు శ్రీకాంత్ నగోతి, హీరోయిన్ స్వాతి రివ్యూల మీద విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రేటింగ్స్ నిరాశ పరిచాయని, ఫిలిం మేకింగ్ మీద అవగాహన లేని వాళ్ళు పేరు లేకుండా రివ్యూలు రాసి బాధ పెట్టారని చెప్పుకొచ్చారు. గొప్పగా ఊహించుకున్న రెస్పాన్స్ తగ్గినప్పుడు కొంత నిరాశ కలగడం సహజం. అయితే బాగున్న చిత్రాన్ని ఎవరూ ఏ రూపంలోనూ అడ్డుకోలేరనేది గ్రహించాల్సిన వాస్తవం. బలగం మొదటి రోజు నాలుగు రేటింగ్స్ రాలేదు. ఉదయం షోలకు జనం కూడా పెద్దగా లేరు. కట్ చేస్తే రెండు మూడు వారాలు అన్ని సెంటర్లలో వసూళ్ల వర్షం. చిరంజీవి భోళాశంకర్ రిలీజ్ రోజు మ్యాట్నీకే పబ్లిక్ పల్చబడింది. మరి మెగాస్టార్ ఇమేజ్ ఏ కోశాన కాపాడలేదే. తాజాగా మ్యాడ్ కు ఆదరణ ఎలా దక్కుతోంది.
థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసేంత విషయం లేనప్పుడు సహజంగానే ఆడియన్స్ లో ఆసక్తి సన్నగిల్లుతుంది. అలాంటప్పుడు ఎవరి మీదనో నిందలు వేసి లాభం లేదు. విజయ్ దేవరకొండకు మొదటి బ్రేక్ ఇచ్చిన పెళ్లి చూపులు ఫస్ట్ డే కలెక్షన్ చూసి దాన్ని పంపిణి చేసిన సురేష్ బాబు నష్టం తప్పదని అంచనా వేశారు. కానీ తర్వాత జరిగింది వేరు. రైటర్ పద్మభూషణ్, సామజవరగమన ఇవేవి మసాలా సినిమాలు కాదుగా. అయినా సరే హిట్టు కొట్టాయి. సన్ అఫ్ సత్యమూర్తి స్టైల్ లో చెప్పాలంటే రేటింగ్స్ బాగా వచ్చినప్పుడు పోస్టర్ల మీద వేసుకుని అలా జరగనప్పుడు తప్పుగా రాశారని అనడం కరెక్ట్ కాదుగా.
This post was last modified on October 7, 2023 5:36 pm
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్‌లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…