రామ్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న స్కంద డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంటిమెంట్ ప్రకారం రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో కనిపించని దర్శకుడు బోయపాటి శీను ఇప్పుడు ఫలితం తేలిపోయాక అందుబాటులోకి వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒకటి తప్ప కొత్త రిలీజులన్నీ మరీ దారుణమైన టాక్ తెచ్చుకోవడంతో స్కంద మళ్ళీ పికప్ అవుతుందేమోననే ఆశలు బయ్యర్లలో చిగురించాయి. కానీ థియేటర్ల దగ్గర టికెట్ల అమ్మకాలు చూస్తే అలా అనిపించడం లేదు. మహా అయితే ఆదివారం కొంత పికప్ కనిపించవచ్చు అంతే.
దీని ఫలితం ఎలా ఉన్న బోయపాటి శీను నెక్స్ట్ అల్లు అర్జున్, సూర్యలతో సినిమాలు చేయడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే రిస్క్ విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉంటున్న బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలకు మాత్రమే స్పష్టమైన కమిట్ మెంట్ ఇచ్చాడు. అన్నీ కుదిరితే అట్లీతో కూడా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. వీళ్ళందరూ ప్రస్తుత ట్రెండ్ కు తగట్టు మాస్ కం క్లాస్ ఎంటర్ టైనర్స్ ఇవ్వగల సమర్థులు. కానీ బోయపాటితో అలా ఉండదు. కేవలం ఊర మాస్ ని మాత్రమే నమ్ముకుని సినిమాలు తీస్తారు.
ఇదే బన్నీతో సరైనోడు తీసి బ్లాక్ బస్టర్ కొట్టి ఉండొచ్చు. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ కి ప్యాన్ ఇండియా ఇమేజ్ లేదు. ఇప్పటి లెక్కలు వేరు. పైగా మొదటి రెండు మినహాయించి బోయపాటి శీనుకి కేవలం బాలకృష్ణతో మాత్రమే సక్సెస్ లున్నాయి. వినయ విధేయ రామ, జయ జానకి నాయక, స్కందలు తేడా కొట్టేశాయి. అలాంటప్పుడు బన్నీతో కాంబో సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. అఖండ 2కి ఇబ్బందులు ఎదురవ్వకపోవచ్చు. స్కంద 2 కూడా డౌటే. మరి సూర్యది ప్రకటించే దాకా కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి. స్కంద ఫెయిల్యూర్ కాకపోయి ఉంటే ఈ విశ్లేషణ వేరుగా ఉండేది.
This post was last modified on October 7, 2023 7:52 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…