Movie News

ముత్తయ్య 800 మెప్పించిందా లేదా

ఈ వారం విడుదలైన కొత్త సినిమాల్లో 800 మీద క్రికెట్ లవర్స్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్స్ లో టాప్ వన్ గా పేరు తెచ్చుకున్న ముత్తయ్య మురళీధరన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెరమీద చూసేందుకు ఉత్సాహం చూపించారు. దానికి తోడు ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేయడం, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ పెద్ద రిలీజ్ వచ్చేలా చేయడం అంతో ఇంతో బజ్ తీసుకొచ్చాయి. ఒక రోజు ముందు కొన్ని ప్రీమియర్లు కూడా వేశారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు జిబ్రాన్ సంగీతం అందించగా టైటిల్ రోల్ మధుర్ మిట్టల్ పోషించారు. ఇంతకీ మూవీ ఎలా ఉంది.

తమిళ సంతతికి చెందిన ముత్తయ్య మురళీధరన్(మధుర్ మిట్టల్) శ్రీలంక క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించేందుకు పోరాటం చేసి జట్టులో చేరి తన అఫ్ స్పిన్ తో విజయాలు సాధిస్తాడు. ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా అంపైర్లు వేసిన నిందల వల్ల నిషేదానికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఈ వివాదం నుంచి బయటపడేందుకు ముత్తయ్య తన నిజాయితిని ఋజువు చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ క్రమంలో తన బాల్యంతో మొదలుపెట్టి యుద్ధం లాంటి లైఫ్ జర్నీ ప్రపంచానికి పరిచయమవుతుంది. చివరికి ముత్తయ్య వరల్డ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా ఎలా ఎదిగాడనేది కథ.

ఒక క్రికెటర్ జర్నీని పారదర్శకంగా చూపించాలని ప్రయత్నం చేసిన దర్శకుడు శ్రీపతి దానికి సరిపడా డ్రామాను సరిగా రాసుకోలేదు. దీంతో ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా నెరేషన్ చాలా నెమ్మదిగా సాగుతూ ఆసక్తిని తగ్గించేస్తుంది. మనకు అంతగా అవగాహన లేని ఈలం సంఘర్షణను ఇతర ప్రాంతాల వారికి అర్థమయ్యేలా చెప్పడంలో తడబడటంతో ముత్తయ్యతో ప్రయాణం ఆశించిన స్థాయిలో అనిపించదు. కొన్ని మంచి సన్నివేశాలు, ఎపిసోడ్లు ఉన్నప్పటికీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ అయితే కాదు. ఓటిటిలో వచ్చినప్పుడు మురళీధరన్ కోసం చూడొచ్చు.

This post was last modified on October 6, 2023 10:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago