లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ కమ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి చర్చ ఇప్పటిది కాదు. ఐదేళ్ల ముందే ఈ సినిమా కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ దాదాపు వంద కోట్ల బడ్జెట్లో సినిమా చేయడానికి ప్రణాళికలు రచించుకుంది. గోపీ స్నేహితుడు, ఒకప్పటి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అయిన సుధీర్ బాబు హీరోగా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా చేయాలనుకున్నారు. కొంత కాలం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరిగాయి.
సుధీర్ సైతం ఈ సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడింది. ప్రవీణ్, సుధీర్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. రెండేళ్లుగా అసలు ఈ సినిమా గురించి చర్చే లేదు. ఇక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ సుధీర్ బాబు మాత్రం గోపీచంద్ బయోపిక్ మీద ఆశలు వదులుకోలేదు.
ఆ సినిమా కచ్చితంగా ఉంటుందని అంటున్నాడు. గోపీ బయోపిక్ హక్కులు ఒక నిర్మాణ సంస్థ నుంచి మరో ప్రొడక్షన్ హౌస్ చేతికి మారాయని.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటిగా ఉంటుందని సుధీర్ చెప్పాడు. ఆటగాడిగా గోపీచంద్, కోచ్‌గా గోపీచంద్.. ఇలా రెండు భాగాలుగా ఈ సినిమా చేయాలని గతంలో అనుకున్నామని.. భవిష్యత్తులో ఎలా చేస్తామో చూడాలని అతనన్నాడు.
గోపీ బయోపిక్ కంటే ముందు తాను మరో మూడు చిత్రాలు చేస్తానని.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అతను స్పష్టం చేశాడు. దర్శకుడెవరు.. ఇతర వివరాలేంటన్నది అతను ఇప్పుడు మాట్లాడలేదు. ప్రస్తుతం తాను ‘మా నాన్న సూపర్ హీరో’, ‘హరోం హర’ చిత్రాల్లో నటిస్తున్నట్లు సుధీర్ వెల్లడించాడు. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. ఆయన జీవితాన్ని సరిగ్గా చూపించే దర్శకుడు కుదరడం కీలకమని అతనన్నాడు.
This post was last modified on October 5, 2023 1:35 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…