ఊహించని విధంగా డిసెంబర్ 22ని సలార్ తీసేసుకోవడంతో ఆ డేట్ కి ముందు ప్లాన్ చేసుకున్న సినిమాలు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. వాటిలో విక్టరీ వెంకటేష్ ప్యాన్ ఇండియా మూవీ సైంధవ్ కూడా ఉంది. పోస్ట్ పోన్ కు సంబంధించిన వార్త కొద్దిరోజుల క్రితమే వచ్చినప్పటికీ ఏ డేట్ ఉంటుందోనని అభిమానులు సంక్రాంతి మీద కాసింత అనుమానంగానే ఉన్నారు. దానికి చెక్ పెడుతూ నిర్మాతలు జనవరి 13 సైంధవ్ ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎఫ్2 తర్వాత వెంకీ ఈ పండగ బరిలో దిగబోతున్నారు.
దీంతో ఒక్కసారిగా పోటీ వేడెక్కిపోయింది. కొద్దిరోజుల క్రితమే ఇదే తేదీకి రవితేజ ఈగల్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 12 గుంటూరు కారం, హనుమాన్ తగ్గేదేలే అంటున్నాయి. విజయ్ దేవరకొండ 13ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ ని మిస్ చేయనివ్వనని నిర్మాత దిల్ రాజు కంకణం కట్టుకున్నారు. సో ఎవరూ డ్రాప్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో థియేటర్ల సర్దుబాటుకి డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే సలార్ డిసెంబర్ చివర్లో రావడమే చాలా మంచిదయ్యింది. లేదంటే జనవరి మొత్తం విపరీతంగా డిస్టర్బ్ అయ్యేది.
సైంధవ్ లాక్ చేసేసుకుంది కాబట్టి ప్రమోషన్లు ఎలా చేయాలనే దాని మీద టీమ్ దృష్టి పెట్టనుంది. కీలక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వడంతో బ్యాలన్స్ మొత్తాన్ని వచ్చే నెలకు ఫినిష్ చేసి నవంబర్ నుంచి ప్రమోషన్ల మీద దృష్టి పెట్టబోతున్నారు. దర్శకుడు శైలేష్ కొలను బడ్జెట్, క్యాస్టింగ్ పరంగా చాలా పెద్ద స్కేల్ మీద సైంధవ్ ని రూపొందించాడు. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ ఫుల్ యాక్షన్ మాస్ గెటప్ లో కనిపించడం దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఉత్సాహం తెచ్చి పెట్టింది. శ్రద్ధ శ్రీనాధ్, రుహాని శర్మ, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆండ్రియా ఇతర పాత్రలు పోషిస్తున్న సైంధవ్ కి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నాడు
This post was last modified on October 5, 2023 12:44 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…