టాలీవుడ్ బాక్సాఫీస్ రేపు కొత్త సినిమాలతో కళకళలాడనుంది. అలా అని మొత్తం హౌస్ ఫుల్ బోర్డులతో, కిటకిటలాడే జనంతో సందడిగా ఊహించుకుంటే పొరపాటే. అన్నీ మీడియం రేంజ్ అందులోనూ టాక్ వస్తేనే పికప్ అయ్యేవి అధిక శాతం ఉన్నాయి. సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేసిన ‘మామా మశ్చీంద్ర’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ థ్రిల్లర్ ఖచ్చితంగా మెప్పిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ప్రమోషన్ల విషయంలో ఒక అడుగు ముందున్న కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ అమాంతం కాదు కానీ క్రమంగా హైప్ తెచ్చుకుంటోంది.
ఇక అందరూ కొత్తవాళ్లే నటించి సితార నాగవంశీ దగ్గరుండి ప్రమోట్ చేస్తున్న ‘మ్యాడ్’కి ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు. నవ్వకపోతే టికెట్ వాపస్ ఇస్తానని ఆయన ఛాలెంజ్ చేయడం వైరల్ అయ్యింది. కలర్స్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత నటించిన ‘మంత్ అఫ్ మధు’ మీద ఎలాంటి హైప్ లేకపోయినా కంటెంట్ లో ఉన్న భావోద్వేగాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెల్లగా రప్పిస్తామని దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’కి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పుకోదగ్గ థియేటర్లు దక్కేలా చేయడంలో సక్సెసయ్యారు. బాగుందనిపించుకుంటే జనం వస్తారు.
హీరో సిద్దార్థ్ తన ‘చిన్నా’ గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఆ మాటల్లో ఎంత మేరకు నిజముందో రేపు తేలనుంది. ఇవి కాకుండా ఏందిరా ఈ పంచాయితీ, గన్స్ ట్రాన్స్ యాక్షన్, నేనే సరోజాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. హైప్ పరంగా మాట్లాడ్డానికి ఏమి లేదు. హిందీ నుంచి అక్షయ్ కుమార్ మిషన్ రాణిగంజ్, ధర్మేంద్ర మనవడి డెబ్యూ దోనో, మరో చిత్రం థాంక్ యు ఫర్ కమింగ్ రంగంలో దిగుతున్నాయి. హాలీవుడ్ హారర్ మూవీ ఎగ్జార్సిస్ట్ బిలివర్ మీద దెయ్యాల ప్రియులు కన్నేశారు. ఇంత ముప్పేటదాడి మధ్య ఆడియన్స్ ఏ గుర్రాలను గెలిపిస్తారో వీటిని పట్టించుకోరో చూడాలి.
This post was last modified on October 7, 2023 8:02 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…