బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం ద్వారా కమర్షియల్‌గా ఎంత ప్రయోజనం పొందాయో తెలిసిందే. ఇదే బాటలో పుష్ప టీం కూడా ఒక కథతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తే అది కూడా చాలా బాగా వర్కవుట్ అవుతోంది. దీంతో ఇదొక ట్రెండ్‌గా మారిపోతోందిప్పుడు. ముందు ఒక పార్ట్‌గానే సినిమాను మొదలుపెట్టడం.. మధ్యలో సినిమా మీద గురి కుదరడం.. కథ విస్తృతి పెరగడంతో రెండు భాగాలు చేయాలని ఆలోచన చేయడం.. కమర్షియల్‌గానూ ఇది బాగా లాభదాయకం అని గ్రహించి పార్ట్-2ను అనౌన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.
తాజాగా ఈ జాబితాలో చేరిన సినిమా దేవర. నిన్నటిదాకా ఇది ఒక సినిమానే అనుకున్నారు. కానీ ఈ రోజు రెండో భాగం అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు కొరటాల శివ.
ప్రస్తుతం తెలుగులో ఇలా రెండు భాగాలుగా రాబోతున్న సినిమాల జాబితా చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. ఆల్రెడీ పుష్ప-2 మేకింగ్ దశలో ఉండగా.. ఇప్పుడు దేవర ఆ జాబితాలో చేరింది. ప్రభాస్ సినిమా సలార్‌ను కూడా రెండు భాగాలుగా చేయబోతున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. తొలి భాగాన్ని సీజ్‌ఫైర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఇంకో సినిమా కల్కి సైతం రెండు లేదా మూడు భాగాలుగా రావచ్చని అంటున్నారు.
దాని గురించి ఇంకా ప్రకటన అయితే రాలేదు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సినిమాలు రెంటిని రెండు భాగాలుగా చేసే ఆలోచనతో మేకర్స్ ఉన్నారట. అందులో ఓజీ ఒకటి కాగా.. ఇంకోటి హరిహర వీరమల్లు. ఇవి రెండూ రెండు భాగాలుగానే వస్తాయంటున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సైతం రెండో భాగం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి కాక టాలీవుడ్లో సీక్వెల్స్ జాబితా కూడా పెద్దదే. డీజే టిల్లు, గూఢచారి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతుండగా.. అఖండ, స్కంద లాంటి సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 4, 2023 10:37 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…