Movie News

స్కంద పనైపోయింది

అనుకున్నదే అయింది. సెలవులు అవ్వగానే ‘స్కంద’ పనైపోయింది. గత గురువారం రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. లాంగ్ అడ్వాంటేజీని బాగానే ఉపయోగించుకుంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ తర్వాత 2, 3 రోజుల్లో వసూళ్లు ఓ మోస్తరుగా రాగా.. ఆదివారంతో పాటు గాంధీ జయంతి సెలవైన సోమవారం కూడా సినిమాకు ఉన్నంతలో మంచి వసూళ్లే వచ్చాయి.

సోమవారం నాటికి వరల్డ్ వైడ్ షేర్ రూ.21 కోట్లను దాటగా.. ఎక్కువగా నెగెటివ్ టాకే తెచ్చుకున్న చిత్రానికి ఈ మాత్రం వసూళ్లు రావడం గొప్పే అనుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు కాబట్టి రెండో వీకెండ్ వరకు బండి లాగిస్తే బయ్యర్లు తక్కువ నష్టాలతో బయటపడతారని అనుకున్నారు. కానీ సోమవారం సెలవు రోజు అవ్వగానే ‘స్కంద’ బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిపోయింది. మంగళవారం మార్నింగ్ షోలకు జనం లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాాచరం.

సాయంత్రానికి కూడా వసూళ్లేమీ మెరుగుపడలేదు. ఆరో రోజు వరల్డ్ వైడ్ ‘స్కంద’ కేవలం రూ.35 లక్షల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇది చాలా నామామత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో సినిమాను నడిపించడానికి మెయింటైనెన్స్ మాత్రమే వచ్చినట్లు లెక్క. డిస్ట్రిబ్యూటర్లకు ఇందులో మిగిలేదేమీ లేదు. నైజాంలో తొలి రోజు తర్వాతి నుంచి అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఈ సినిమా మంగళవారం రూ.10 లక్షల షేర్ మార్కును కూడా టచ్ చేయలేకపోయింది.

‘స్కంద’ ఫుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టమని తేలిపోయింది. ఈ వీకెండ్లో వస్తున్నవన్నీ చిన్న సినిమాలే అయినప్పటికీ ‘స్కంద’ అడ్వాంటేజీని ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు. రూ.42 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే స్థితిలో ఉన్న ఈ చిత్రం రూ.18-19 కోట్ల మధ్య బయ్యర్లకు నష్టం తెచ్చి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చుు.

This post was last modified on October 4, 2023 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago