మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఖిలాడీ, వాల్తేరు వీరయ్య లాంటివి హిందీ డబ్బింగ్ జరుపుకున్నప్పటికీ సరైన రీతిలో నార్త్ ఆడియన్స్ కి చేరకపోవడంతో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అందుకే ఈసారి స్వయంగా తనే రంగంలోకి దిగాడు. ట్రైలర్ లాంచ్ ముందు హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ప్లాన్ చేసి జాతీయ మీడియాని టార్గెట్ చేసుకున్నాడు. ఈ విషయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చొరవని తక్కువ చేసి చూడలేం. ఎంత స్టార్ డం ఉన్నా రవితేజ స్టామినా అక్కడి జనాలకు అంతగా అవగాహన లేదు.
సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని పసిగట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒరిజినల్ రౌడీ రాథోడ్, కిక్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేసిన హీరో ఇతనేనని పరిచయం చేయడం ఆకట్టుకుంది. విక్రమార్కుడులో రవితేజ టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ముందు రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ సరితూగలేదనే మాట వాస్తవం. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ చేసినా కిక్ లో మాస్ రాజా చూపించిన ఎనర్జీ ముందు అది సాటిరాదు. వీటి అనువాదాలు ఎక్కువ మంది చూడకపోవడంతో ఈ పాయింట్ ఇప్పటిదాకా గుర్తింపుకు నోచుకోలేదు. అనుపమ్ ఖేర్ సరైన రీతిలో పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చి క్లారిటీ వచ్చేలా చేశారు.
అక్టోబర్ 20న విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావుకు పోటీ పరంగా విజయ్ లియో, టైగర్ శ్రోఫ్ గణపథ్ తీవ్రమైన పోటీ ఇచ్చేలా ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరిని తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇబ్బంది లేదు కానీ మిగిలిన ఇద్దరినీ కాచుకోవాల్సిన ఒత్తిడి రవితేజ మీద ఉంటుంది. ట్రైలర్ లో విజువల్స్ చూశాక అందరికీ నమ్మకం వచ్చేసింది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబిన్ హుడ్ రేంజ్ పీరియాడిక్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇచ్చింది. అంచనాలను ఏ మాత్రం నిలబెట్టుకున్నా చాలు రవితేజకు నేషనల్ లెవెల్ లో మార్కెట్ ఏర్పడుతుంది. అది తర్వాత వచ్చే ఈగల్ కు ఉపయోగపడుతుంది.
This post was last modified on October 4, 2023 2:05 pm
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…