బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్ మామూలుగానే సినిమాలు చేయడంలో డెడ్ స్లో. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మే ఆమిర్.. మూణ్నాలుగేళ్లకు గానీ ఒక సినిమా చేయడు. 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వచ్చాక ఆమిర్ చేసిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ నాలుగేళ్ల గ్యాప్‌లో రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా తన కొత్త సినిమాను ప్రకటించనేలేదు. దాని కోసం కసరత్తు చేస్తున్న సంకేతాలు కూడా కనిపించలేదు.
ఇంకెప్పుడు కొత్త చిత్రం అనౌన్స్ చేస్తాడా అని అభిమానులు చూస్తుంటే.. ఈ రోజు ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆమిర్ కొత్త సినిమా చేయబోతున్నాడు. కానీ అది హీరోగా కాదు.. నిర్మాతగా. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ‘లాహోర్, 1947’ సినిమాను ప్రకటించారు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటించబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఆమిర్ ఖాన్ నుంచి అభిమానులు ఆశిస్తున్నది ఒకటైతే.. అతను ప్రకటించింది ఇంకోటి. సొంత బేనర్లో వేరే చిత్రాలు నిర్మిస్తే ఓకే కానీ.. తను నటిస్తూ ఆ పని కూడా చేయాల్సింది. కానీ ఆమిర్ ఖాన్ నటనను పక్కన పెట్టేసి నిర్మాణం మీదే దృష్టిపెట్టడం అభిమానులకు రుచించడం లేదు. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ డిజాస్టర్ కావడం ఆమిర్‌ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నది స్పష్టం.
ఇది అందరు హీరోలకూ జరిగేదే. కానీ ఆమిర్ ఈ విషయాన్ని మరీ పర్సనల్‌గా తీసుకుని నటన నుంచి విరామం తీసుకోవడం.. మళ్లీ ఎప్పుడు ముఖానికి రంగేసుకునేది స్పష్టత లేకపోవడం అభిమానులకు వేదన కలిగిస్తోంది. ఆమిర్ లాంటి నటుడు ఇలా నటనకు దూరమైతే తట్టుకోలేమని.. ఇప్పటికి తీసుకున్న గ్యాప్ చాలని.. వీలైనంత త్వరగా కొత్త కథను ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on October 8, 2023 4:31 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…