టాలీవుడ్లో ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్ అయిన శ్రీలీల గురించి ఇటీవల ఒక రూమర్ జోరుగా వినిపించింది. ఒకేసారి చాలా సినిమాలు ఒప్పేసుకోవడంతో.. అన్నింటికీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె ఒకట్రెండు సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నదే ఆ రూమర్. ఆమె వైదొలిగిన ప్రాజెక్టుల్లో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా సితార ఎంటర్టైట్మెంట్స్ వాళ్లు నిర్మిస్తున్న చిత్రంలో ఆమె లేదని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలోకి రష్మిక మందన్నా వచ్చేసిందని కూడా అన్నారు. అందరూ నిర్మాణ సంస్థ దీని గురించి స్పందించకపోవడంతో ఈ న్యూస్ పక్కా అని… మళ్లీ విజయ్-రష్మిక జోడీని చూడబోతున్నామని అంరదూ ఫిక్సయిపోయారు. కానీ ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు నిర్మాత నాగవంశీ.
విజయ్‌తో తాము నిర్మిస్తున్న సినిమాలో శ్రీలీలే హీరోయిన్ అని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో తేల్చేశాడు. శ్రీలీల తమ చిత్రం నుంచి తప్పుకుందన్న రూమర్ ఎవరు పుట్టించారో.. ఎందుకు పుట్టించారో తెలియదని.. తాము మాత్రం కాస్ట్ విషయంలో ఎలాంటి మార్పూ చేయట్లేదని నాగవంశీ స్పష్టం చేశాడు. శ్రీలీలే తమ సినిమాలో హీరోయిన్ అని.. అదే ఫైనల్ అని అతనన్నాడు.
ఎప్పుడో మొదలు కావాల్సిన చిత్రం ‘లైగర్’ డిలే వల్ల.. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో పరశురామ్‌తో సినిమాను విజయ్ ముందు ఆరంభించడం వల్ల ఆలస్యం అయిందని అతను తెలిపాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కుతున్నట్లు నాగవంశీ వెల్లడించడం విశేషం. విజయ్ మీద వంద కోట్ల బడ్జెట్ కూడా ఎక్కువ అనుకుంటే.. అంతకుమించి ఖర్చు పెడుతున్నట్లు నాగవంశీ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా దర్శకుడు గౌతమ్ మీద నమ్మకంతో పెడుతున్న బడ్జెట్టే అని.. ఈ సినిమా క్లిక్ అయితే మామూలుగా ఆడదని.. లేదంటే ఏం జరుగుతుందో చెప్పలేమని నాగవంశీ అన్నాడు.
This post was last modified on October 3, 2023 3:17 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…