‘సలార్’ అనే ఆటంబాంబు వచ్చి క్రిస్మస్ సీజన్ మీద పడిపోయింది. దీంతో ఆ సీజన్‌కు ఆల్రెడీ ఫిక్సయిన సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సలార్’ క్రిస్మస్‌కు రాబోతోందని ఊహాగానాలు మొదలవగానే.. ఈ మూడు చిత్రాల మేకర్స్ వేరే ఆప్షన్ల మీద దృష్టిసారించారు. ‘సలార్’ డేట్ అధికారికంగా ప్రకటించగానే విక్టరీ వెంకటేష్ మూవీ ‘సైంధవ్’ను 2024 సంక్రాంతికి తీసుకురావాలన్న ఆలోచన చేశారు మేకర్స్.
ఇక రెండు మూడు రోజుల చర్చల తర్వాత వెంకీ అన్నయ్య సురేష్ బాబు ఆమోద ముద్ర వేసేశారు. దీంతో ఈ రోజు ‘సైంధవ్’ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 13న ఈ చిత్రం విడుదల కానున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘నా సామిరంగా’ చిత్రాల సంక్రాంతి రిలీజ్ గురించి అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వాటికి తోడైంది.
వెంకీ సినిమా సంగతి తేలిపోగా.. ఇక నాని, నితిన్ చిత్రాల ముచ్చటే తేలాల్సి ఉంది. ముందు, వెనుక చాలా వరకు వీకెండ్స్ ప్యాక్డ్ అయిపోయి ఉండగా… సరైన డేట్ ఎంచుకోవడం వీటికి అంత తేలిక కాదు. నాని సినిమా ‘హాయ్ నాన్న’కు డిసెంబరు 7ను సీరియస్‌గా కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే డిసెంబరు 1న రిలీజ్ కానున్న ‘యానిమల్’కు మంచి టాక్ వస్తే రెండో వారంలోనూ దూకుడు చూపించవచ్చు.
ఎంతైనా అది హిందీ సినిమా, నాని చిత్రం ప్రభావం ప్రధానంగా తెలుగు రాష్ట్రాలోనే కాబట్టి దీనికి ఇక్కడ పెద్దగా సమస్య లేకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఆ డేట్‌ను ఖరారు చేసే అవకాశాలే ఎక్కువ. ఆ వారానికి విశ్వక్సేన్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా రాబోతోంది. నితిన్ సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను డిసెంబరు 17న ‘కెప్టెన్ మిల్లర్’తో పాటుగా లేదంటే క్రిస్మస్‌కు, సంక్రాంతికి మధ్యలో డిసెంబరు 30న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 2, 2023 5:40 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…