Movie News

ఒకే ఫ్రేములో యష్ తారక్ ?

ఎంత ఆలస్యమవుతున్నా, ఎన్ని వాయిదాలు పడుతున్నా అంచనాల విషయంలో మాత్రం అంతకంతా పైకే వెళ్తున్న సలార్ విడుదలకు ఇంకో రెండున్నర నెలలు టైం ఉన్నప్పటికీ అభిమానులకు ఇప్పటి నుంచే నిద్ర పట్టడం లేదు. ఇక ఎలాంటి పోస్ట్ పోన్ కి ఛాన్స్ లేకపోవడంతో నిశ్చింతగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ డుంకీ ఉన్నప్పటికీ దానికి ఎదురేగి మరీ కవ్వించడం పట్ల ఇప్పటికే బాలీవుడ్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్ కి అవసరం లేకపోవడంతో ప్రభాస్ యాక్షన్ మాస్ ని ఎప్పుడెప్పుడు చూస్తామాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోగా కొన్ని షాకిచ్చే లీకులొస్తున్నాయి.

క్లైమాక్స్ తర్వాత వచ్చే పోస్ట్ క్రెడిట్ సన్నివేశాల్లో యష్, జూనియర్ ఎన్టీఆర్ ల చిన్న సర్ప్రైజ్ క్యామియోలు ఉంటాయని, ఊహించని రీతిలో వాటిని దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడని బెంగళూరు టాక్. సాధారణంగా ఈ ప్యాటర్న్ హాలీవుడ్ సినిమాలకు వాడతారు. రోలింగ్ టైటిల్స్ అయిపోయేలోపు జనం సీట్లలో నుంచి లేచి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళను చివరి సెకండ్ దాకా కూర్చోబెట్టే టెక్నిక్లో భాగంగా పోస్ట్ క్రెడిట్ ఎపిసోడ్స్ ఉంటాయి. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, అవతార్ లాంటి సిరీస్ లకు ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడింది. సలార్ కి కూడా అలాగే వాడతారన్న మాట.

ఇది నిజమయ్యే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఎందుకంటే తనకు అతి పెద్ద లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ అడిగితే యష్ ఎట్టి పరిస్థితుల్లో కాదు అనడు. పైగా కెజిఎఫ్ 3 ప్లానింగ్ ఉంది. ఇంకోవైపు దేవర, వార్ 2 తర్వాత తాను చేయబోయే మూవీ సలార్ దర్శకుడితోనే కాబట్టి ఆ అనుబంధంతో అడిగితే తారక్ నో చెప్పడు. పైగా ఫ్యూచర్ లో దీన్ని నీల్ యునివర్స్ గా వాడుకునే అవకాశం ఉంటుంది. సో ప్రభాస్ మూవీలో ఇలా యష్, తారక్ లు వచ్చి సందడి చేస్తే థియేటర్లో జరిగే అల్లరి గురించి వేరే చెప్పాలా. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త టీజర్ ని సిద్ధం చేస్తోంది హోంబాలే టీమ్. 

This post was last modified on October 2, 2023 3:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీని ఇబ్బంది పెట్టిన ఆ సినిమా ఏది?

‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…

7 minutes ago

మరణశిక్షపై ట్రంప్ కఠిన వైఖరి!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…

33 minutes ago

పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఇంకా తగ్గలేదు

మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…

1 hour ago

ఉస్తాదుకి పనికొచ్చే బేబీ జాన్ పొరపాట్లు !!

పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…

2 hours ago

రేపు సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన…

2 hours ago