Movie News

సలార్ వెర్సస్ డుంకి.. రణరంగమే

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ పోరును క్రిస్మస్ వీకెండ్లో చూడబోతున్నాం. ఆల్రెడీ ఆ సీజన్‌కు షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరానిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డుంకి’ ఫిక్స్ అయి ఉంది. రెండేళ్ల కిందటే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చారు. కొత్తగా ప్రభాస్-ప్రశాంత్ నీల్‌ల ‘సలార్’ సైతం క్రిస్మస్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇంత పెద్ద సినిమాలు రెండు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ తట్టుకుంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వీటికి థియేటర్లు సర్దుబాటు చేయడం పెద్ద సవాలుగా మారే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు సోలోగా రిలీజైతే.. దేశంలో ఉన్న 80-90 శాతం థియేటర్లలో తొలి వీకెండ్ అంతా ఏ ఇబ్బందీ లేకుండా ప్రదర్శించే కెపాసిటీ ఉన్నవే. టాక్‌తో సంబంధం లేకుండా వీకెండ్ అంతా థియేటర్లను కళకకళలాడించే సత్తా వాటికి ఉంది. అలాంటి చిత్రాలు ఒకదాంతో ఒకటి పోటీ పడటం వల్ల రెంటికీ వసూళ్లలో కోత తప్పదు.

ఐతే పోటీ అనివార్యం అని తెలిశాక థియేటర్ల విషయంలో ఆల్రెడీ రెండు చిత్రాల మేకర్స్ వారి వారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి ‘డుంకి’నే ముందంజలో ఉంది. దీనికి చాలా ముందుగానే రిలీజ్ ఖరారు కావడంతో థియేటర్లను బుక్ చేసే ప్రక్రియను డిస్ట్రిబ్యూటర్లు ముందే మొదలుపెట్టారు. ‘సలార్’ డేట్ ఫిక్సయ్యాక ‘డుంకి’ డిస్ట్రిబ్యూటర్లు దూకుడు పెంచారు. ఉత్తరాదిన మల్టీప్లెక్సుల్లో మేజర్ స్క్రీన్లను ‘డుంకి’కే కేటాయించేలా ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది.

సింగిల్ స్క్రీన్లలోనూ సగానికి సగం ‘డుంకి’కి వెళ్లిపోవడం ఖాయం. ‘సలార్’ లేటుగా రేసులోకి వచ్చినా.. దానికి దేశవ్యాప్తంగా ఉన్నది మామూలు హైప్ కాదు. ఆల్రెడీ థియేటర్ల విషయంలో ఒప్పందాలు జరిగినా.. ‘సలార్’ రేంజ్ సినిమాకు స్క్రీన్లు తగ్గించే పరిస్థితి లేదు. దీంతో ఒప్పందాలు రివైజ్ చేయక తప్పేలా లేదు. ‘సలార్’ టీం కూడా బలమైన డిస్ట్రిబ్యూటర్లతో రంగంలోకి దిగుతుండటంతో దానికి దక్కాల్సిన స్క్రీన్లు దానికి దక్కేలాగే కనిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో థియేటర్ల కోసం రెండు చిత్రాల ప్రతినిధుల మధ్య ఒక రణరంగం లాంటి వాతావరణం నెలకొనడం ఖాయం అంటున్నారు. ఓవర్సీస్‌లో కూడా థియేటర్లను దక్కించుకునే విషయంలో రెండు చిత్రాలకూ గట్టి పోటీ నెలకొనేలా ఉంది. క్రిస్మస్ సీజన్లో ‘ఆక్వామన్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రం రిలీజవుతుండటంతో ఓవర్సీస్‌లో రెండు చిత్రాలకూ ఇబ్బందులు తప్పేలా లేవు. మరి థియేటర్లను దక్కించుకునే విషక్ష్ంలో ఎవరు పైచేయి సాధిస్తారన్న దాన్ని బట్టే ఓపెనింగ్స్ కూడా ఆధారపడి ఉంటాయి.

This post was last modified on October 1, 2023 9:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

50 minutes ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

1 hour ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

1 hour ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

3 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

3 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

4 hours ago