ఈ రోజుల్లో నటీనటులు, టెక్నీషియన్ల వ్యక్తిత్వం, వాళ్ల ప్రవర్తన కూడా సినిమాల ఫలితాల మీద ప్రభావం చూపుతోంది. మాటలు, ప్రవర్తనలో ఏమాత్రం హద్దులు దాటినా.. సోషల్ మీడియా జనాలు వాళ్ల మీద పడిపోతున్నారు. సినిమా రిలీజవడానికి ముందే నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అకారణంగా సినిమాలను టార్గెట్ చేసే బ్యాచ్‌లు కూడా తయారయ్యాయి. మంచి సినిమాలను సైతం కొన్నిసార్లు టార్గెట్ చేసి దెబ్బ తీస్తున్నారు.
అలాంటిది సినిమా అటు ఇటు అయితే మాత్రం నెగెటివిటీ మామూలుగా ఉండట్లేదు. సంబంధం లేని విషయాలకు ముడిపెట్టి సినిమాలను టార్గెట్ చేస్తున్న ఈ రోజుల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సాధ్యమైనంత వరకు న్యూట్రల్‌గా ఉంటూ, వివాదాలకు జోలికి వెళ్లకపోవడం.. అణకువతో కనిపించడం అవసరంగా మారింది. సోషల్ మీడియాలో, సినిమా వేడుకల్లో యారొగెంట్‌గా కనిపిస్తే ఆ ప్రభావం సినిమాల మీద పడుతోంది.
అదే సమయంలో అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకుందామని చూసినా.. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకుని పనికి రాని సినిమాలు చేసినా.. అలాంటి వాళ్లకు కూడా ఆడియన్స్ వాతలు పెడుతున్నారు. ఈ విషయం కొంచెం లేటుగా అర్థం చేసుకున్నట్లున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో అతడికి అనుకోకుండా మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో అవకాశాలు వరుస కట్టాయి. కానీ అతను వీటిలోంచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోలేదు.
సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్ లాంటి పేలవమైన సినిమాలు చేశాడు. ముందు వెనుక చూసుకోకుండా ఈ సినిమాలను చకచకా పూర్తి చేసి రిలీజ్ చేశాడు. వాటికి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. ‘మీటర్’ సినిమాతో అతడి మీద నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఒక దశలో అతడి సెల్ఫ్ ప్రమోషన్ శ్రుతి మించింది. దీనికి తోడు తనను అదే పనిగా కొన్ని గ్యాంగ్స్ టార్గెట్ చేస్తున్నాయంటూ సింపతీ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
కంటెంట్ లేని సినిమాలు చేస్తూ ఎవరో తనను టార్గెట్ చేస్తున్నారని ఏడవడం వల్ల ప్రయోజనం ఉండదు. వచ్చిన ఫాలోయింగ్ అంతా కరిగిపోతున్న పరిస్థితుల్లో ‘రూల్స్ రంజన్’ సినిమా కిరణ్ కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కిరణ్ చాలా అణకువతో మాట్లాడాడు. తాను చేసిన తప్పుల గురించి అంతర్మథనం కనిపించింది.
ఇలాంటి తప్పులు పునరావృతం కావని.. విషయం ఉణ్న సినిమాలు చేస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ‘రూల్స్ రంజన్’ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ ఉద్దేశించి తీసిందని క్లారిటీ ఇచ్చాడు. రివ్యూయర్లు, ట్రోల్ చేసే వాళ్ల విషయంలో కూడా అతను స్పోర్టివ్ స్పిరిట్‌తో మాట్లాడాడు. మొత్తానికి అతడి స్పీచ్‌లో ఒక పరిణతి కనిపించింది. కొంచెం లేటుగా అయినా కిరణ్‌కు తత్వం బోధపడిందని.. ఇదే మైండ్‌సెట్‌తో మంచి సినిమాలు చేసి, హంబుల్‌గా ఉంటే తిరిగి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 1, 2023 7:33 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…