కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మనకు పరిచయం తక్కువే కానీ ఇటీవలే వచ్చిన జైలర్ లో క్యామియో ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ఓం, యోగి, గోరింటాకు లాంటి ఎన్నో ఒరిజినల్ వెర్షన్లు కన్నడలో బ్లాక్ బస్టర్స్ అయిన ట్రాక్ రికార్డు ఈయనది. దసరాకి ఘోస్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో మల్టీ లాంగ్వేజెస్ లో ప్లాన్ చేస్తున్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో, గణపథ్ లతో తీవ్రమైన పోటీ ఉన్నా సరే అక్టోబర్ 19 రావడం ఖాయమేనని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇందాకా రెండు నిముషాలు సాగే టీజర్ రిలీజ్ చేశారు.
అతని(శివరాజ్ కుమార్)కి యుద్ధమంటే ఇష్టం. సమాజ స్థాపన కోసం కష్టపడిన వాళ్ళ కన్నా విధ్వంసం చేసినవాళ్లనే జనం గుర్తు పెట్టుకుంటారనే సిద్ధాంతాన్ని నమ్ముతాడు. దానికి అనుగుణంగానే నేర సామ్రాజ్యంలో పెరిగి పెద్దవుతాడు. తుపాకీ పట్టుకుంటే ముందు వెనుకా ఆలోచించకుండా మారణ హోమం సృష్టిస్తాడు. ఏకంగా జైలుని లక్ష్యంగా పెట్టుకుని అక్కడి ఖైదీలతో రణరంగంని తలపిస్తాడు. అసలు ఈ ఘోస్ట్ ఎవరు, నేపథ్యం ఏంటి, పోలీసులకు ఎందుకు కొరకరాని కొయ్యగా మారాడనే ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడమంటున్నారు ఘోస్ట్ టీమ్.
విజువల్స్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అయితే విఎఫెక్స్ వాడి ఆయన్ని కుర్రాడిగా చూపించిన విధానం ఆశ్చర్యపరిచే విధంగా చాలా సహజంగా ఉంది. అనుపమ్ ఖేర్, జయరాం లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఘోస్ట్ లో భాగమయ్యారు. శ్రీని దర్శకత్వం వహించగా అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు. ప్రత్యేకంగా ఇందులో గ్లామర్ పార్ట్, డ్యూయెట్లు, హీరోయిన్ అంటూ ఏవీ లేవు. శాండల్ వుడ్ లో ఈ ఘోస్ట్ మీద కెజిఎఫ్ రేంజ్ లో అంచనాలున్నాయి. మరి ఇతర భాషల్లో భారీ కాంపిటీషన్ మధ్య బజ్ ఎలా సృష్టిస్తారో చూడాలి.
This post was last modified on October 1, 2023 2:50 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…