Movie News

పండగ లిస్టులో రజనీకాంత్ లాల్ సలామ్

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయో అంతు చిక్కనంతగా ప్రకటనల ప్రహసనం కొనసాగుతోంది. తాజాగా లాల్ సలాం కూడా పండగ బరిలో దూకేందుకు సిద్ధమయ్యింది. కేవలం హీరో విష్ణు విశాల్ మూవీగా చూస్తే దీని గురించి మనం ఆలోచించాల్సిన పని ఉండేది కాదు.  కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ లెన్త్ ఉన్న ప్రత్యేక పాత్ర చేయడం వల్ల దీన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ కం గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. జైలర్ రిలీజ్ కు ముందే తండ్రి పోర్షన్లను కూతురు పూర్తి చేసింది.

ఇప్పుడీ ఎంట్రీ వల్ల పోటీ మరింత రసవత్తరంగా మారింది. గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ లు ఆల్రెడీ మేం తగ్గేదేలే అంటూ ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. శివ కార్తికేయన్ అయలన్ మొన్నటి వారమే అనౌన్స్ మెంట్ ఇచ్చింది. నిన్న అరన్మనయ్ 4 ప్రకటన వచ్చింది. ఇప్పుడీ లాల్ సలాం. క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ తెలుగు డబ్బింగ్ హక్కులు మన నిర్మాతల్లో ఎవరో ఒకరు కొంటారు. తక్కువో ఎక్కువో దొరికినన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. అలాంటప్పుడు సహజంగానే మనవాటికి స్క్రీన్లు కొన్ని తగ్గిపోతాయి.

ఇలా ఎవరికి వారు అందరూ సంక్రాంతే కావాలని పట్టుబట్టడం జనవరి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్ విసిరేలా ఉంది. అందరినీ సంతృప్తిపరిచేలా సర్దుబాటు చేయడం పెద్ద సవాలే. మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ, రజనీకాంత్ ఇలా ఎవరినీ తక్కువ చేసేందుకు అవకాశం లేకుండా భారీ కంటెంట్లతో సిద్ధమవుతున్నారు. ఎవరైనా డ్రాప్ అవుతారా అంటే ఆ సూచనలేమీ కనిపించడం లేదు. ప్రాజెక్ట్ కె తప్పుకోకపోయి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అది రాదని తేలిపోవడంతో నువ్వా నేనా అనే సవాళ్లతో ప్రొడ్యూసర్లు సిద్ధమవుతున్నారు. ఈ ప్రవాహం ఇక్కడితో ఆగేలా లేదు

This post was last modified on October 1, 2023 2:44 pm

Share

Recent Posts

జనసైనికులను రెచ్చగొడుతున్నారా అంబటి?

కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…

1 minute ago

రజిత ఆవేదన కరెక్టేగా

టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…

8 minutes ago

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

53 minutes ago

రజినీకి ఎంత ముట్టింది?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…

3 hours ago

దిల్ రాజు తీసుకున్న తెలివైన నిర్ణయం

విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…

3 hours ago

కీల‌క స‌మ‌యంలో కాడి ప‌డేస్తున్నారు

ఏ రాజ‌కీయ పార్టీకైనా కూడా ఎన్నిక‌లే కీల‌కం. తమ స‌త్తా నిరూపించేందుకు.... త‌మ బ‌లం చాటుకునేందుకు ప్ర‌జల్లో త‌మ‌కు ఉన్న…

7 hours ago